Chilukuru Balaji: చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమం రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్‌

హైదరాబాద్‌ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాల్సిన ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు.

Published : 20 Apr 2024 16:25 IST

హైదరాబాద్‌ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాల్సిన ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందులు తలెత్తిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు తమ ఇళ్లలోనే దేవుడిని ప్రార్థించుకోవాలని సూచించారు. ఆదివారం సాయంత్రం నిర్వహించాల్సిన కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుందన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు