TS News: తెలంగాణలో ఓటింగ్‌ను పెంచేదెలా?

ప్రజాస్వామ్యంలో ఓటు అన్నది ఓ వజ్రాయుధం. అలాంటి ఈ ఓటు తెలంగాణలో నిర్వీర్యం అవుతోంది. ఓటింగ్‌ శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.

Published : 24 Apr 2024 15:27 IST

అయిదేళ్లు తమను పాలించి సమస్యలను పరిష్కరించే నాయకుడిని ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం ఓటు. అలాంటి ఈ ఓటు తెలంగాణలో నిర్వీర్యం అవుతోంది. ఎన్నిక ఎన్నికకూ ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు వేసేందుకు నిరాసక్తత చూపిస్తున్నారు. అదే సమయంలో నిరక్ష్యరాసులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ గణనీయంగా పెరుగుతోంది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తున్నా రాష్ట్రంలో ఫలితం ఎందుకు ఉండడం లేదు? ఓటింగ్ శాతం పెంచాలంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది?

Tags :

మరిన్ని