వైకాపా పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ బొటన వేలు కోసుకున్న మహిళ

వైకాపా అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు. నిరసన తెలియజేయడానికి ఎన్నో మార్గాలున్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు.

Published : 22 Apr 2024 18:54 IST

వైకాపా అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు. ‘సొంత బాబాయిని హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే మాత్రం స్పందిస్తారా?’ అని అన్నారు. వైకాపా పాలనపై నిరసన తెలియజేయడానికి ఎన్నో మార్గాలున్నాయని సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. వైకాపా అసుర పాలనను అంతం చేయడానికి కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. 

Tags :

మరిన్ని