Kotappakonda: సమస్యల వలయంలో కోటప్పకొండ

మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. అక్కడి తిరునాళ్లకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ నిర్వహణ పనులు నత్తనడకన సాగడం, రోడ్ల మరమ్మతులు ప్రారంభం కాకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటప్పకొండ తిరునాళ్ల అంటేనే ప్రభల పండగ. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భారీ ప్రభలు కోటప్పకొండకు వస్తుంటాయి. పుణ్యక్షేత్రంగానే కాక పర్యాటక ప్రాంతంగానూ గుర్తింపు పొందిన కోటప్పకొండలో ఐదేళ్లుగా పర్యాటక అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచి పోవడంతో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Published : 28 Feb 2024 23:40 IST

Tags :

మరిన్ని