Eluru: చెరువుకి గండికొట్టి.. రైతులపై వైకాపా సర్పంచ్‌ దౌర్జన్యం

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పంగిడిగూడెంలో వైకాపా (YSRCP) సర్పంచ్ స్థానిక రైతులపై దౌర్జన్యానికి దిగారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని చెరువు పొంగి నీళ్లు రోడ్డుపైకి వచ్చాయి. పొలాల్లోకి నీళ్లు వెళ్లేలా గ్రామ సర్పంచ్  చెరువుకు గండికొట్టడంతో రైతులు అడ్డుకున్నారు. నీరు వెళ్లడానికి ఉన్న మార్గాన్ని వైకాపా నేత లేఅవుట్ వేసి పూడ్చినట్టు అన్నదాతలు తెలిపారు. పంట పొలాలు దెబ్బతింటాయని చెప్పినా వినకుండా తమను పక్కకు లాగేసి సర్పంచ్ దుర్భాషలాడారని రైతులు వాపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నీళ్లు పొలాల్లోకి వెళ్లకుండా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి మళ్లించారు.   

Published : 07 Dec 2023 10:27 IST
Tags :

మరిన్ని