Satya Kumar: భాజపా నేత సత్యకుమార్ వాహనంపై.. వైకాపా కార్యకర్తల దాడి

అమరావతి ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. మందడంలో రాజధాని రైతు ఐకాస సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న భాజపా నేత సత్యకుమార్ (Satya Kumar) వాహనాన్ని వైకాపా కార్యకర్తలు, ఎంపీ సురేశ్ అనుచరులు అడ్డుకున్నారు. మూడు రాజధానుల శిబిరం పక్క నుంచి వెళ్తున్న కారును ఒక్కసారిగా దూసుకొచ్చి నిలువరించారు. వాహనానికి అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. సత్యకుమార్ కారు అద్దాలను వైకాపా కార్యకర్తలు పగలగొట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న భాజపా శ్రేణులు వారిని ప్రతిఘటించారు. పోలీసుల సాయంతో సత్యకుమార్ వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Published : 31 Mar 2023 16:51 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు