Hyderabad: నీటి సంపులో పడి యువకుడి దుర్మరణం

చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో నీటి సంపును తెరిచి ఉంచటంతో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 22 Apr 2024 12:55 IST

చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో నీటి సంపును తెరిచి ఉంచటంతో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి ఖలీల్ కుమారుడు అక్మల్ సుఫియాన్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శిక్షణ నిమిత్తం అక్మల్‌ను కంపెనీ వారు హైదరాబాద్‌కు పంపించి.. గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో ఉండేందుకు నివాసం ఏర్పాటు చేశారు. ఉదయం వ్యాయామశాలకు వెళ్లిన అక్మల్ ఫ్లాట్‌కు బయలుదేరాడు. అప్పటికే, ఇంటి యజమాని ఆవరణలో ఉన్న సంపులో మోటార్ వేసి, ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో అపార్ట్ మెంట్‌కు వచ్చిన అక్మల్.. సంపు తీసి ఉండటాన్ని గమనించక, అందులో పడిపోయాడు. విషయం తెలిసి.. వెంటనే సంపులోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే అక్మల్  మృతి చెందాడు.

Tags :

మరిన్ని