బస్సు యాత్రలో జగన్‌కు చేదు అనుభవం.. చంద్రబాబు, పవన్‌కు జై కొట్టిన యువత

అనకాపల్లిలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో జగన్‌ ఎదుటే కొందరు యువకులు చంద్రబాబు, పవన్‌కు జైకొడుతూ నినాదాలు చేశారు.

Published : 20 Apr 2024 14:09 IST

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు (Jagan) చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లాలో శనివారం నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా గోకులపాడు వద్ద ప్రజలకు అభివాదం చేయడానికి జగన్‌ బస్సు దిగుతుండగా కొందరు యువకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు, పవన్‌కు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని నినాదాలు చేయవద్దని హెచ్చరించారు. దీంతో జగన్‌ మొక్కుబడిగా ఓ మహిళతో మాట్లాడి బస్సు లోపలికి వెళ్లిపోయారు.

Tags :

మరిన్ని