YS Sharmila: వైఎస్‌ఆర్‌ను తిట్టిన బొత్స సత్యనారాయణ.. జగన్‌కు తండ్రి సమానులా?: వైఎస్‌ షర్మిల

మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులంటూ సీఎం జగన్‌ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై బొత్స ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు.

Updated : 24 Apr 2024 15:22 IST

బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులు అని జగన్‌ అనడం ఆశ్యర్యంగా ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోసిన వ్యక్తి అని ఆమె ఆరోపించారు. బొత్స పలు సందర్భాల్లో వైఎస్‌ కుటుంబాన్ని దూషించినట్టు చెప్పారు. విజయమ్మను సైతం బొత్స అవమాన పరిచారని పేర్కొన్నారు. అలాంటి బొత్స సత్యనారాయణ.. జగన్‌కు తండ్రి సమానులు అయ్యారని విమర్శించారు. జగన్ క్యాబినెట్‌లో ఉన్న వారందరూ వైఎస్ఆర్‌ను తిట్టిన వారేనని దుయ్యబట్టారు. నిజంగా తన కోసం పని చేసిన వాళ్లు.. జగన్‌కు ఏమి కారని విమర్శించారు. ‘వైఎస్సార్‌సీపీ’ పార్టీ పేరులో వైఎస్సార్ లేరని విమర్శించారు. 

Tags :

మరిన్ని