Sunitha: వివేకాపై ప్రేమ ఉంటే అవినాష్‌ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలి: సునీత

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత (Sunitha) స్పష్టం చేశారు. కడపలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపణలు, విమర్శలకు ఆమె సమాధానాలిచ్చారు. గత ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి గెలుపు కోసం వివేకానందరెడ్డి కష్టపడి పని చేసింది నిజమైతే.. ఆయన చివరి కోరిక తీర్చుకునే అవకాశం వారికి వచ్చిందని తెలిపారు. షర్మిలను కడప ఎంపీగా చేయాలనే వివేకా కోరికను నెరవేర్చే అవకాశం వచ్చింది.. చేస్తారా? అని ప్రశ్నించారు. నిజంగా వారికి వివేకా మీద ప్రేమ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని షర్మిలకు మద్దతు ఇవ్వాలని సవాల్‌ విసిరారు. 

Published : 17 Apr 2024 09:38 IST

Tags :

మరిన్ని