అభివృద్ధి లేకపోయినా నోరు కట్టేసుకోవాలా?: వైకాపా నాయకులను నిలదీసిన కార్యకర్త

ఆంధ్రప్రదేశ్‌లో ఏం అభివృద్ధి జరుగుతోందని మళ్లీ ఓట్లు వేయాలని ఓ వైకాపా (YSRCP) కార్యకర్త నాయకులను నిలదీశారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో హిందూపురంలోని 13వ వార్డు సడ్లపల్లి గ్రామంలో గురువారం రాష్ట్రానికి ‘జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో కంగుతిన్న వైకాపా నాయకులు కార్యకర్తకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆ కార్యకర్త కార్యక్రమం నుంచి బయటికి వెళ్లిపోయారు. 

Published : 08 Dec 2023 14:04 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు