AP News: ఏపీలో స్క్రీనింగ్‌ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్‌ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. మార్చి 16 నుంచి 26లోపు ఈ చెల్లింపులు సాగిపోయాయి. ఆర్థిక శాఖలో అధికార పార్టీకి ఎప్పటి నుంచో అండదండలు అందిస్తున్న కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన, చర్చ ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన ఆర్థిక బిల్లుల చెల్లింపులో ఎలాంటి పరిశీలన, పారదర్శకత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Published : 28 Mar 2024 09:34 IST

Tags :

మరిన్ని