Fake Currency: మద్యం దుకాణంలో వైకాపా కార్యకర్త నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి!

పల్నాడు జిల్లా యడ్లపాడులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వైకాపా కార్యకర్త దొంగ నోట్లు మార్చడం స్థానికంగా కలకలం రేపింది. కారుచోల గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త  షేక్ ఖాజా రూ.500 నోటు ఇచ్చి మద్యం కొనుగోలు చేశాడు. నగదును బ్యాంకులో జమ చేసేందుకు మద్యం దుకాణం సిబ్బంది వెళ్లగా.. అది నకిలీ నోటుగా తేలింది. మద్యం కొనుగోలు చేసేందుకు మళ్లీ ఖాజా రావడంతో దుకాణ సిబ్బంది అతడిని పట్టుకుని తనిఖీ చేశారు. అతడి వద్ద మరో ఏడు రూ.500 నకిలీ నోట్లు లభించాయి.

Updated : 28 Mar 2024 22:28 IST
Tags :

మరిన్ని