YSRCP: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు పరార్‌

గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు.

Published : 17 May 2024 18:59 IST

గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈనెల 14న మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. రెండు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న పిన్నెల్లి సోదరులు.. పోలీసుల కళ్లుగప్పి ఇంటి నుంచి ఎలా వెళ్లారనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని