Elon Musk: ఎలాన్‌మస్క్‌కు భారీ షాక్‌.. ఒక్కరోజులో 20.3 బిలియన్‌ డాలర్లు ఆవిరి

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కు భారీ షాక్ తగిలింది. టెస్లా షేర్ల భారీ పతనంతో మస్క్ ఒక్కరోజే ఏకంగా 20.3 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.64లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అయినా ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ అగ్రస్థానంలోనే ఉన్నారు. వడ్డీ రేట్లు ఇలాగే కొనసాగితే విద్యుత్ వాహనాల (టెస్లా) ధరలను మరింత తగ్గించక తప్పదని మస్క్ వెల్లడించారు. దీంతో గురువారం నాటి అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లో ఆ సంస్థ షేరు ధర ఏకంగా 9.7శాతం తగ్గింది. ఈ క్రమంలో ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. "బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్" సూచీ ప్రకారం మస్క్ మొత్తం నికర సంపద...234.4 బిలియన్ డాలర్లకు తగ్గింది

Updated : 21 Jul 2023 23:16 IST

Tags :

మరిన్ని