kalanjali_200
Comments
0
Recommend
0
Views
379
ఐసిస్‌ అనుమానితుడికి రిమాండ్‌ విధింపు
దిల్లీ: ఐసిస్‌తో సంబంధాలున్న అనుమానితుడిని పోలీసు కస్టడీకి పంపిస్తూ దిల్లీ కోర్టు శుక్రవారం రిమాండ్‌ విధించింది. నిందితుడు మొహ్‌సిన్‌ ఇబ్రహీం సయ్యద్‌ (28)ను దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అరెస్టు చేసి.. అదనపు సెషన్స్‌ జడ్జి రీతేశ్‌ సింగ్‌ ఎదుట హాజరు పరచగా ఈ నెల 10 వరకు రిమాండ్‌ విధించారు. ఈ మేరకు నిందితుడిని ప్రశ్నించడానికి కస్టడీకి అనుమతించాలని పోలీసు ప్రత్యేక విభాగం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. గత నెలలో అరెస్టు చేసిన ఉత్తరాఖండ్‌కు చెందిన నలుగురు ఐసిస్‌ అనుమానితులతో ఇతనికి సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబయికి చెందిన సయ్యద్‌ (28)ను ఉత్తర దిల్లీలోని కశ్మీరీ గేట్‌ ఐఎస్‌బీటీ వద్ద పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. కేంద్ర నిఘాసంస్థకు అందిన రహస్య సమాచారంతో అతన్ని పట్టుకున్నారు. అతను సిరియాకు వెళుతున్నట్లు విచారణలో తేలిందని ప్రత్యేక పోలీసు కమిషనర్‌ అరవింద్‌ దీప్‌ తెలిపారు.
Your Rating:
-
Overall Rating:
0