తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత!

తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ప్రదర్శనలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి.

Updated : 15 May 2024 11:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని నిర్వాహకులు తెలిపారు. దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించామన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్‌ అద్దెలు పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని