IND vs AFG: ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు.. భారత్‌దే బంగారు పతకం

ఆసియా క్రీడల్లో (Asian Games) భారత పురుషుల జట్టు స్వర్ణం దక్కించుకుంది. అఫ్గానిస్థాన్‌ (IND vs AFG)తో ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు గోల్డ్ మెడల్‌ వచ్చింది. టాస్‌ నెగ్గిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో 18.2 ఓవర్ల సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. అప్పటికి అఫ్గాన్ స్కోరు 112/5. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేసిన నిర్వాహకులు భారత్‌కు బంగారు పతకం అందించారు.

Updated : 18 Jul 2024 14:26 IST