News in images: చిత్రం చెప్పే విశేషాలు (06-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 06 Jun 2024 09:39 IST
1/22
విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో వాటర్‌ యాపిల్‌ నోరూరిస్తోంది. వేసవిలో ఈ పండ్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే విలువైన ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో వాటర్‌ యాపిల్‌ నోరూరిస్తోంది. వేసవిలో ఈ పండ్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే విలువైన ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు.
2/22
నిజామాబాద్‌ జిల్లాలో ఏ సీజన్‌ అయినా ముందుగా బోధన్‌ డివిజన్‌లోనే వరినాట్లు, కోతలు ప్రారంభమవుతుంటాయి. నెల రోజుల కిందటే నారుమళ్లను సిద్ధం చేసుకున్న కర్షకులు ప్రస్తుతం నాట్లు వేడయం ప్రారంభించారు. నిజామాబాద్‌ జిల్లాలో ఏ సీజన్‌ అయినా ముందుగా బోధన్‌ డివిజన్‌లోనే వరినాట్లు, కోతలు ప్రారంభమవుతుంటాయి. నెల రోజుల కిందటే నారుమళ్లను సిద్ధం చేసుకున్న కర్షకులు ప్రస్తుతం నాట్లు వేడయం ప్రారంభించారు.
3/22
ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరానికి చెందిన షేక్‌ ఖాసిం... తెలుగుదేశం వీరాభిమాని. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ సాధించి.. చంద్రబాబు ఎన్డీయే సమావేశానికి దిల్లీకి వెళ్తున్నారని తెలిసి.. గన్నవరం విమానాశ్రయానికి ఇలా సైకిల్‌పై వచ్చారు.  

4/22
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కరీంనగర్‌ పట్టణంలోని మంకమ్మతోటకు చెందిన సైకత శిల్పి ఆర్‌.శంకర్‌ ఇసుకతో మోదీ సైకత శిల్పాన్ని రూపొందించారు.

5/22
కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామ శివారులో ఓ రైతు యాసంగి వరి పంటను యంత్రంతో కోశాడు. ఆ సమయంలో కొన్ని గింజలు పొలంలో పడిపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి అవి మొలకెత్తి పచ్చని పైరులా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది.

6/22
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్‌ సీసాల వినియోగం తగ్గించాలంటూ  ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ‘టర్నింగ్‌ ఆఫ్‌ ది ట్యాప్‌’ పేరిట 12 అడుగుల ఎత్తున వ్యర్థాలు, పాత ప్లాస్టిక్‌ సీసాలతో కళాకృతిని ఆవిష్కరించారు.

7/22
వర్షాల కారణంగా అమీర్‌పేట వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు నరక యాతన పడ్డారు. మరోవైపు ఓ వాహనదారుడు సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తూ, డైలాగులను ఆలకిస్తూ ఇలా కనిపించాడు

8/22
పాదచారుల సౌకర్యార్థం ఉప్పల్‌ చౌరస్తాలో రూ.35 కోట్లతో స్కైవాక్‌ నిర్మించారు. ప్రమాదాలు జరగకుండా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిపైనుంచి రోడ్డు సులువుగా దాటొచ్చు. అయినా కొందరు నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా రోడ్ల పైనుంచే ఇలా వెళ్తున్నారు.

9/22
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూకట్‌పల్లి రంగధాముని చెరువు, ఐడీఎల్‌ యాక్సిస్‌ రోడ్డు కూడలి వద్ద వృక్షాలను, పర్యావరణాన్ని రక్షించాలని స్ఫూర్తి కలిగించేలా ఏర్పాటు చేసిన ఈ కట్టడం ఆకట్టుకుంది. 

10/22
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో పలువురు సినీ తారలు సందడి చేశారు. స్థానికంగా ఓ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో హర్షవర్ధన్‌రాణే, వర్షిని, రియా సచ్‌దేవ ఉత్సాహంగా పాల్గొన్నారు.

11/22
ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు  ఒక్క వారంలో వినియోగించినవి. నీటి, శీతల పానీయాల బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్‌ పైపులు  చిన్నపాటి గుట్టలా తయారయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెల్లి గ్రామానికి  సమీపంలో కనిపించాయి.

12/22
తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో కాలువలో పడిన నీరంతా మురుగుతో కలిసి ఒక్కసారిగా రోడ్డుపైకి చేరింది. మోకాళ్లు మునిగే వరకు వచ్చిన మురుగుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

13/22
నెల్లూరు: భగభగమనే ఎండతో బుధవారం మధ్యాహ్నం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడగా- సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం ఇలా మేఘావృతమైంది. నాలుగు చినుకులు పడతాయనుకునేలోపే దోబూచులాడుతూ.. ఉట్టిగనే అలా తరలివెళ్లాయి.

14/22
మహబూబ్‌నగర్‌ బాలకేంద్రంలో వేసవి సాంస్కృతిక శిక్షణ ముగింపు సందర్భంగా బుధవారం రాత్రి పట్టణంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు.. మధురమైన స్వరంతో చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక సంకీర్తనలు అలరించాయి.

15/22
ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో బుధవారం సాయంత్రం ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. చిన్నారులు ఇక్కడ నేర్చుకున్న కళలను ప్రదర్శించారు. శివ తాండవం నృత్య రూపకం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

16/22
సహజసిద్ధమైన వస్తువుల వినియోగాన్ని నిత్యావసరాల్లో పెంచాలని కోరుతూ ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అనేకచోట్ల మొక్కలు నాటారు.

17/22
నిజామాబాద్‌: రెంజల్‌ మండలంలోని కందకుర్తి గోదావరి నది ఇసుక దిబ్బల్లో పలువురు రైతులు తర్బూజ, కీరదోస సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎరువుల వినియోగం లేకుండా పండించిన తర్బూజకు మార్కెట్లో డిమాండ్‌ ఉందని చెబుతున్నారు.

18/22
విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీగా విజయం సాధించిన సీఎం రమేశ్‌ బుధవారం నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన రమేశ్‌ దంపతులకు తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్‌ దంపతులు, ఆలయ ఈఓ బండారు ప్రసాద్‌ స్వాగతం పలికారు.

19/22
మెదక్‌: వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో కృత్తికా నక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామికి లక్ష పుష్పార్చన చేశారు. విజయదుర్గా సమేత సంతాన క్షేత్రంలో మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.

20/22
చిత్తూరు: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వేణుగోపాలుని రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. తితిదే అనుబంధ శ్రీరుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు.

21/22
మెదక్‌: సంగారెడ్డి పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాల అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

22/22
హైదరాబాద్‌: అక్కడక్కడా..మళ్లీ రూపాయి ఫోన్‌ బాక్సులు కనిపిస్తున్నాయి. చరవాణి ఛార్జింగ్‌ లేనప్పుడు అత్యవసరంగా ఎవరైనా ఇంటికి సమాచారం ఇచ్చుకోవడానికి వీటిని వినియోగిస్తున్నారు. ఈ చిత్రం నాంపల్లి-గాంధీభవన్‌ సమీపంలో కనిపించింది.

Tags :

మరిన్ని