India Records at Uppal Match: భారత్‌ బ్యాటర్ల ఊచకోత.. ఉప్పల్‌ మైదానంలో రికార్డుల మోత.. 

బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ సునాయాస విజయం (India vs Bangladesh) సాధించింది. సంజూ శాంసన్‌ (111), సూర్య కుమార్‌ యాదవ్‌ (75) విజృంభించిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సిరీస్‌ 3-0తో భారత్‌ వశమైంది. ఈ క్రమంలో నమోదైన రికార్డులు ఇవే.. 

Eenadu icon
By Photo News Team Updated : 13 Oct 2024 09:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/12
ఈ మ్యాచ్‌లో చేసిన 200+ స్కోరు టీ20ల్లో 37వది. టీ20 చరిత్రలో ఇన్ని 200+ స్కోరులు ఏ జట్టుకూ లేవు. 

2/12
భారత్‌ తరఫున వేగంగా సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా సంజు శాంసన్‌ నిలిచాడు. 40 బంతుల్లో సంజు సెంచరీ బాదగా.. 35 బంతుల్లో రోహిత్‌ శర్మ ఆ ఫీట్‌ సాధించాడు. 

3/12
22 సిక్స్‌లు బాదిన టీమ్‌ ఇండియా.. ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌ల లిస్ట్‌లో మూడులో ఉంది. ఇక మన రికార్డుల్లో అయితే తొలి స్థానం ఈ ఇన్నింగ్స్‌దే.

4/12
వేగంగా 100 పరుగులు సాధించిన తొలి టీమ్‌ భారత్‌. 7.1 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది. ఇప్పటివరకు ఈ రికార్డు 7.6 ఓవర్లతో భారత్‌ పేరిటే ఉండేది.

5/12
భారత్‌ తరఫున టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌. ఇప్పటివరకు ఇండియన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అత్యధిక స్కోరు 89. 2022లో శ్రీలంక మీద ఇషాన్‌ కిషన్‌  చేశాడు. 

6/12
200 పరుగుల మార్కును చేరుకోవడానికి భారత్‌కు పట్టిన ఓవర్లు 14. ఇప్పటివరకు ఆ రికార్డు 13.5 ఓవర్లతో సౌతాఫ్రికా పేరిట ఉంది. 

7/12
బౌండరీలు (6+4) రూపంలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌ ఇదే. టీమ్‌ ఇండియా బ్యాటర్లు 22 సిక్స్‌లు, 25 ఫోర్లతో 232 పరుగులు పిండుకున్నారు. మొత్తంగా 47 బౌండరీలతో అత్యధిక బౌండరీల లిస్ట్‌లోనూ భారత ఇన్నింగ్స్‌ టాప్‌లో నిలిచింది. 

8/12
సొంత మైదానంలో వరుసగా 16 సిరీస్‌ విజయాలతో భారత్‌ అప్రతిహత జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. 2019 నుంచి మనం మన దేశంలో సిరీస్‌లో ఓడిపోలేదు.

9/12
ఓవర్‌లో పదికి మించి పరుగులు నమోదైన ఏకైక ఇన్నింగ్స్‌ భారత్‌దే. మొత్తంగా 18 ఓవర్లలో 10కిపైగా పరుగులు నమోదయ్యాయి.

10/12
టీ20ల్లో భారత్‌ తరఫున ఒకే ఓవర్‌లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన రెండో బ్యాటర్‌ సంజు శాంసన్‌. ఆరు సిక్స్‌లతో ఈ లిస్ట్‌లో యువరాజ్‌ టాప్‌లో ఉన్నాడు. 

11/12
పవర్‌ ప్లేలో 82/1 కొట్టి టీమ్‌ ఇండియా రికార్డుల లిస్ట్‌లో సంయుక్తంగా టాప్‌లో ఉంది. 82/2తో ఆ రెండో టాపర్‌ కూడా మనమే. 

12/12
ఈ మ్యాచ్‌లో 297/6 చేసి..టీ20 క్రికెట్‌లో రెండో అత్యధిక స్కోరును సాధించిన జట్టుగా భారత్‌ నిలిచింది. టెస్టు హోదా ఉన్న జట్లలో అయితే మనదే ఫస్ట్‌ ప్లేస్.

Published : 13 Oct 2024 08:44 IST

మరిన్ని

సుఖీభవ

చదువు