Mount Everest: రుచికర వంటకాలుగా పులిహోర.. పప్పుచారు!

ఎవరెస్టు శిఖరాన్ని రెండు వారాల్లో మూడుసార్లు అధిరోహించి నేపాల్‌ మహిళ ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

Published : 08 Jun 2024 01:57 IST

కరెంట్‌ అఫైర్స్‌

ఎవరెస్టు శిఖరాన్ని రెండు వారాల్లో మూడుసార్లు అధిరోహించి నేపాల్‌ మహిళ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అత్యంత శక్తిమంతమైన న్యూక్లియర్‌ స్టెల్త్‌ బాంబర్‌ బీ 21 రైడర్‌ను అమెరికా ఆవిష్కరించింది. దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో వయోజనులందరికీ టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. ముస్లిం ఉపకులాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేరళలో ఏడో తరగతి విద్యార్థుల సిలబస్‌లో కృత్రిమ మేధని పాఠ్యాంశంగా పెట్టాలని నిర్ణయించగా, అస్సాంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా ఏఐ రోబో ఉపాధ్యాయురాలిని ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా రుచికర శాకాహార వంటకాలుగా ఉత్తర భారత వంటకాలతో పాటు ఆంధ్రా నుంచి పులిహోర, పప్పుచారు, చద్దన్నం ఎంపికయ్యాయి. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ ఆసక్తికర వర్తమానాంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఇటీవలి కాలంలో వివిధ దేశాల్లో ఎన్నికైన అధినేతలు, ప్రపంచ స్థాయి సదస్సులు, ఉత్సవాలు, నాసా, ఇస్రో ప్రయోగాలు, ముఖ్యమైన నియామకాలు, ప్రభుత్వరంగ సంస్థల సరికొత్త కార్యకలాపాలు, రక్షణ, విజ్ఞాన రంగంలోని తాజా పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలి.

మాదిరి ప్రశ్నలు

1. ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ న్యూక్లియర్‌  సెక్యూరిటీ (ICONS) సదస్సు ఇటీవల ఎక్కడ   జరిగింది?

1) రోమ్‌      2) మాస్కో  
3) వియన్నా   4) కీవ్‌

2. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నూతన  ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

1) రాకేష్‌ రంజన్‌     2) కార్తీ మధు 
3) ప్రసాద్‌ రావు      4) రాకేష్‌ కుమార్‌ 

3. కిందివాటిలో సరైంది?

ఎ) ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలాన్ని 2024, జూన్‌ 30 వరకు కేంద్ర ప్రభుత్వం   పొడిగించింది ్బ2024, మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉంద్శి.
బి) డీఆర్‌డీఓ ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ పదవీకాలాన్ని 2025, మే 31 వరకు కేంద్రం పొడిగించింది ్బ2024, మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉంద్శి.
సి) 1958లో డీఆర్‌డీఓ ఏర్పడింది.
డి) ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం ఆర్మీ వైస్‌ చీఫ్‌గా ఉన్నారు.

1) ఎ, బి, సి     2) బి, సి, డి 
3) ఎ, బి, సి, డి  4) సి, డి 

4. జతపరచండి.

ఎ) మే 30          1) ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ క్లీన్‌ ఎనర్జీ
బి) డిసెంబరు 21    2) వరల్డ్‌ ఫుట్‌బాల్‌ డే 
సి) మే 25          3)అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం
డి)జనవరి 26       4) వరల్డ్‌ బాస్కెట్‌బాల్‌ డే 
1) ఎ-4, బి-3, సి-1, డి-2     2) ఎ-3, బి-4, సి-2, డి-1 
3) ఎ-2, బి-3, సి-1, డి-4     4) ఎ-1, బి-2, సి-3, డి-4

5. కిందివాటిలో సరైంది?

ఎ) భూమిపై సముద్రాలను పరిశీలించడానికి ‘పేస్‌’ అనే ఉపగ్రహాన్ని ఇటీవల నాసా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
బి) స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ సాయంతో ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్‌ కెనవెరాల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది.
సి) ఈ ఉపగ్రహం 676 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ సముద్ర జలాలు, భూవాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, సి   4) ఎ, బి, సి 

6. పూర్ణిమ శ్రేష్ఠ ప్రపంచంలో ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని 2 వారాల్లో మూడుసార్లు అధిరోహించి రికార్డు నెలకొల్పారు. ఈమె ఏ దేశానికిచెందినవారు?

1) ఇండియా   2) చైనా 
3) నేపాల్‌     4) న్యూజిలాండ్‌ 

7. కిందివాటిలో సరైంది?

ఎ) భారతీయ చిత్రం ‘అల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ 77వ కేన్స్‌ చలన చిత్రోత్సవాల్లో ‘గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డు’ పొందింది.
బి) ‘అల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్రాన్ని పాయల కపాడియా రూపొందించారు.
సి) 77వ కేన్స్‌ చలన చిత్రోత్సవాల్లో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు.
డి) ‘ది షేమ్‌లెస్‌’ అనే హిందీ చిత్రంలో అత్యుత్తమ నటనకు అనసూయ సేన్‌గుప్తాకు ఈ అవార్డు వచ్చింది.

1) ఎ, బి, సి         2) ఎ, బి, డి 
3) ఎ, బి, సి, డి     4) బి, సి 

8. ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్రంలోని ముస్లిం ఉపకులాలకు ఓబీసీ హోదాను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది?

1) కలకత్తా హైకోర్టు      2) మద్రాస్‌ హైకోర్టు 
3) అలహాబాద్‌ హైకోర్టు   4) గౌహతి హైకోర్టు

9. కిందివాటిలో సరైంది?

ఎ) డొమినికన్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా రెండోసారి లూయిస్‌ అబినాడర్‌ ఎన్నికయ్యారు.
బి) లిథువేనియాకు రెండోసారి అధ్యక్షుడిగా గిటానస్‌ నౌసెడా ఎన్నికయ్యారు.
సి) ఐస్‌లాండ్‌ అధ్యక్షురాలిగా హల్లాటోమిస్‌ డోత్తిర్‌ ఎన్నికయ్యారు.
డి) హైతీ నూతన ప్రధానమంత్రిగా గ్యారి కొనిల్లే నియమితులయ్యారు.
1) ఎ, బి, సి     2) ఎ, బి, డి 
3) ఎ, బి, సి, డి  4)ఎ, డి 

10. కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎమ్‌బీ) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?    

1) శ్రీహాన్‌ రెడ్డి     2) ఉదయ్‌ విరాజ్‌ 
3) అశోక్‌ గోయల్‌   4) అభినాయర్‌

11. కిందివాటిలో సరైంది?

ఎ) ‘ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ గ్లోబల్‌ సిటీ ఇండెక్స్‌-2024’లో న్యూయార్క్‌ మొదటి స్థానంలో నిలిచింది.
బి) లండన్‌ ్బఇంగ్లండ్శ్, సంజోష్‌ ్బఅమెరిక్శా 2, 3 స్థానాల్లో నిలిచాయి.
సి) దిల్లీ 350, బెంగళూరు 411, ముంబయి 427, చెన్నై 472 స్థానాల్లో దక్కించుకున్నాయి. 
డి) ఎకనామిక్స్, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన, మానవ మూలధనం లాంటివాటిని   పరిగణనలోకి తీసుకుని 163 దేశాలకు చెందిన నగరాలకు ఈ ర్యాంకులు కేటాయించారు.

1) ఎ, బి, సి     2) బి, సి, డి     
3) ఎ, బి, సి, డి   4) ఎ, బి 

12. అమెరికాలో నిర్వహించిన ‘స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ-2024’ విజేత?

1) బృహత్‌ సోమ    2) నళిన్‌ కిరణ్‌ 
3) బృహత్‌ గురు     4) స్వప్న రావు

13. సుప్రీంకోర్టు పరిధిలో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి సంబంధించి ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది?

1) జస్టిస్‌ నాగరత్న    2) జస్టిస్‌ హిమాకోహ్లీ 
 3) జస్టిస్‌ రోహిణి     4) జస్టిస్‌ ఇందు మల్హోత్రా

14. హెల్త్‌ ప్రమోషన్స్‌కి గాను 2024కి వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) నెల్సన్‌ మండేలా అవార్డు ఏ సంస్థకు దక్కింది?

1) అపోలో గ్రూప్‌     2)  NIMHANS  గ్రూప్‌ 
3) ఆర్టిమిస్‌ గ్రూప్‌     4) మణిపాల్‌ గ్రూప్‌  NIMHANS- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్శ్‌

15. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ కమాండంట్‌గా అజయ్‌ కొచ్చర్‌ స్థానంలో ఎవరు నియమితులయ్యారు?

1) గురుచరణ్‌ సింగ్‌     2) నందీ సింగ్‌ 
3) నిరంజన్‌ సింగ్‌       4) అమృత్‌పాల్‌ సింగ్‌

16. ఏ సంవత్సరం నాటికి క్షయ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది?

1) 2030   2) 2045   3) 2032   4) 2025

17. కిందివాటిలో సరైంది?

ఎ) డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో యునైటెడ్‌ ఆర్గనైజేషన్‌ స్టెబిలైజేషన్‌ మిషన్‌లో పనిచేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్‌ రాధికా సేన్‌కు యూఎన్‌ఓ మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (2023) అవార్డు వచ్చింది.
బి) ఈమె హిమాచల్‌ప్రదేశ్‌కు చెందినవారు.
సి) 2019లో మొదటిసారిగా ఈ అవార్డును ఇండియా నుంచి మేజర్‌ సుమన్‌ గవానీ అందుకున్నారు.
డి) ఇండియా నుంచి ఈ అవార్డు అందుకున్న నాలుగో వ్యక్తి రాధికా సేన్‌.

1) ఎ, బి, సి, డి     2) ఎ, బి, సి 
3) ఎ, బి, డి        4) ఎ, సి, డి 

18. ఇటీవల పొగాకు నియంత్రణకు రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?

    1) పి.వి.సింధు     2) మిథాలీరాజ్‌ 
    3) హారిక           4) కోహ్లీ 

19. కిందివాటిలో సరైంది?

ఎ) ఈశాన్య భారతదేశంలో ్బఅస్సాం ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తుంద్శి తొలి AI  ఉపాధ్యాయురాలిగా ‘ఐరిస్‌ రోబో’ నిలిచింది. (నీతిఆయోగ్‌ ప్రారంభించిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ప్రాజెక్టు కింద మేకర్‌ ల్యాబ్స్‌ ఎడ్యు-టెక్‌ సహకారంతో ఈ రోబోను తయారుచేశారు.
బి) యాంటీ రేడియేషన్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణి రుద్రం - 2ను SU - 30 MKI ఫైటర్‌ జెట్‌ నుంచి  ఇటీవల విజయవంతంగా పరీక్షించారు.
సి) ప్రపంచంలోనే తొలిసారి చెక్కతో తయారుచేసిన లిగ్నోశాంట్‌ అనే ఉపగ్రహాన్ని జపాన్‌ శాస్త్రవేత్తలు 2024, అక్టోబరులో అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు.
డి) భారత్‌లో 40 ఏళ్లలోపు వారు 20% మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, 26% తల, మెడ క్యాన్సర్, 16% జీర్ణ సంబంధిత క్యాన్సర్, 15% బ్రెస్ట్‌ క్యాన్సర్, 9% మంది బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడైంది.
ఇ) విద్య ఆధునికీకరణ కోసం కేరళ ప్రభుత్వం   పాఠశాల విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ్శ సంబంధిత జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏడోతరగతి విద్యార్థుల పాఠ్య ప్రణాళికలో ఏఐని పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు తెలిపింది.
1) ఎ, బి, సి, డి   2) ఎ, బి, సి, డి, ఇ 
3) ఎ, బి, సి      4) ఎ, బి, డి

20. కిందివాటిలో సరైంది?

ఎ) తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేట్‌ ప్రయోగ వేదిక నుంచి 2024, మే 30న     అగ్నిబాణ్‌ రాకెట్‌ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.
బి) భారతదేశంలో ప్రైవేట్‌ ప్రయోగ వేదిక నుంచి  జరిగిన మొదటి ప్రయోగం.
సి) దేశంలోనే మొదటి సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌ను నింగిలోకి పంపారు. ఇంజిన్‌కు అగ్నిలెట్‌ అని పేరు పెట్టారు.
డి) మొదటి సింగిల్‌ పీస్‌ - 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్‌ను వినియోగించి, వాహక నౌకకు శక్తినిచ్చేలా    దేశీయంగా నిర్మించారు.
ఇ) దేశంలో ఇది రెండో ప్రైవేటు అంతరిక్ష ప్రయోగం. మొదటిది 2022, నవంబరులో ప్రవేశపెట్టిన విక్రమ్‌.
1) ఎ, బి, సి, డి     2) ఎ, బి, సి, డి, ఇ 
3) ఎ, బి, సి        4) ఎ, బి, డి 

21. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన న్యూక్లియర్‌ స్టెల్త్‌ బాంబర్‌ బీ 21 రైడర్‌ ఏ దేశానికి చెందింది?

1) రష్యా    2) ఇండియా  
3) చైనా     4) అమెరికా

22. కిందివాటిలో సరైంది?

ఎ) ప్రపంచ ఫుడ్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌ 2024’ జాబితాలో ఉత్తర భారత దేశానికి చెందిన దాల్‌ తడ్కా 83  శాకాహార వంటకాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
బి) పంజాబీ వంటకం షామీ పన్నీర్‌కు రెండో స్థానం వచ్చింది.
సి) మహారాష్ట్ర వంటకం మిసల్‌ 3వ స్థానం, మిసల్‌పావ్‌ 4వ స్థానంలో నిలిచాయి.
డి) ఆంధ్రప్రదేశ్‌ నుంచి పులిహోర 19వ, మిరపకాయ బజ్జీ 40వ, చద్దన్నం 36వ, పప్పుచారు 50వ స్థానాల్లో నిలిచాయి.
 1) ఎ, బి, సి, డి     
 2) బి, సి 
 3) ఎ, బి, సి
4) ఎ, డి

సమాధానాలు

1-3; 2-1; 3-3; 4-2; 5-4; 6-3; 7-3; 8-1; 9-3; 10-3; 11-3; 12-1; 13-2; 14-2; 15-1; 16-4; 17-2; 18-1; 19-2; 20-2; 21-4; 22-1.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని