AAI Recruitment: భారీ వేతనం.. ఎయిర్‌పోర్టు అథారిటీలో 496 ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 02 Nov 2023 18:17 IST

దిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 496 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 1 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

  • విద్యార్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ (బీఎస్సీ) సైన్స్‌, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులుగా ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు అర్హులు. 
  • వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు నవంబర్‌ 30 నాటికి 27 ఏళ్లు మించరాదు. 
  • నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలు, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఇతరులకు సడలింపు ఉంటుంది. 
  • ఆన్‌లైన్‌ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తారు. 
  • వేతన శ్రేణి:  రూ.40 వేలు నుంచి 1,40,000 వరకు ఉంటుంది.
  • దరఖాస్తు రుసుం: ఇతరులకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఎలాంటి రుసుం చెల్లించనవసరంలేదు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు