APPSC: 597 గ్రూప్‌- 1, గ్రూప్‌ -2 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ఏపీలో 597 గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Updated : 28 Aug 2023 21:08 IST

అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 597 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ(APPSC)కి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 89 గ్రూప్‌-1 పోస్టులు.. 508 గ్రూప్‌ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

గ్రూప్‌- 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ST), అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టులతో సహా పలు ఉద్యోగాలను; గ్రూప్‌-2 కేటగిరీ కింద డిప్యూటీ తహసీల్దార్లు (గ్రేడ్‌ II), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ III, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్ IIతో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు APPSCకి అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు APPSC నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని