AP ICET Rankers: ఏపీ ఐసెట్‌లో 96.71% ఉత్తీర్ణత.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

ఏపీ ఐసెట్‌ పరీక్షలో 96.71శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 22 Jun 2024 17:18 IST

ఏపీ ఐసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

AP ICET Results| ఎస్కేయూ, అనంతపురం: ఏపీలో ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,447 మంది ICETకు హాజరు కాగా.. 42,984  మంది (96.71శాతం) అర్హత సాధించినట్లు ఆయన వెల్లడించారు.

కొలువు కొట్టాలంటే.. ఈ నైపుణ్యాలు కావాల్సిందే..!

ఐసెట్‌లో టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఎ. క్రాంతికుమార్‌ 176.81 మార్కులతో తొలి ర్యాంకు సాధించగా.. గున్నం సాయి కార్తిక్‌ (తూర్పుగోదావరి జిల్లా) రెండో ర్యాంకు, సూరిశెట్టి వసంతలక్ష్మి (విశాఖపట్నం) మూడు, కడపన గణేష్‌ కుమార్‌ రెడ్డి (అనంతపురం) నాలుగు, సామిరెడ్డి తరుణ్‌ కుమార్‌ (విజయనగరం) ఐదో ర్యాంకు సాధించి సత్తా చాటారు. అలాగే, ఎస్‌. దశరథరామరెడ్డి (తూర్పుగోదావరి) ఆరో ర్యాంకులో నిలవగా.. కొర్లం శ్రీకుమార్‌ (శ్రీకాకుళం), పుచ్చా అనుపమ (తూర్పుగోదావరి) ఎనిమిది, దవనబోయన వెంకటేశ్‌ (అనంతపురం) తొమ్మిది, దొరై మునిశేషాద్రి గిరీష్‌ సాయి (చిత్తూరు) పదో ర్యాంకు సాధించారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు