AP Inter: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

ఏపీలో ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

Published : 01 Dec 2023 22:10 IST

AP Inter Exam Fee | అమరావతి: ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్‌ రెగ్యులర్‌, వొకేషనల్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గడువు నవంబర్‌ 30తోనే ముగిసింది. అయితే, ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి మరో ఐదు రోజుల పాటు బోర్డు ఛాన్స్‌ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.  రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులకు ఆలస్య రుసుం లేకుండా డిసెంబర్‌ 5వరకు; రూ. 1000 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 15వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు గడువు పెంపుపై పాఠశాల ప్రిన్సిపాళ్లు, కళాశాల యాజమాన్యాలు అవగాహన కల్పించాలని కోరారు. ఇంటర్‌ మొదటి/రెండో సంవత్సరం పరీక్ష ఫీజు రూ.550 కాగా.. రెండో ఏడాది ప్రాక్టికల్స్‌కు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు