AP SI exam: ఎస్సై తుది రాతపరీక్ష ప్రాథమిక కీ విడుదల

AP SI final exam key| ఏపీలో ఎస్సై తుది రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఈ పరీక్ష ప్రాథమిక కీని పోలీస్‌ నియామక బోర్డు విడుదల చేసింది.

Updated : 15 Oct 2023 21:44 IST

అమరావతి: ఏపీలో ఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శని, ఆదివారాల్లో విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ పరీక్షలు రాసేందుకు 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించగా శనివారం (అక్టోబర్‌ 14) జరిగిన పేపర్‌-1 (ఇంగ్లిష్‌), పేపర్‌-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో రోజైన ఆదివారం (అక్టోబర్‌ 15) జరిగిన పేపర్‌-3 (అరిథ్‌మెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ) పరీక్షకు 30,569 మంది, పేపర్‌-4(జనరల్‌ స్టడీస్‌) పరీక్షకు 30,560 మంది హాజరయ్యారు. పేపర్‌-3, 4 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ప్రాథమిక కీలను ఏపీ ఎస్‌ఎల్‌పీఆర్‌బీ(APSLPRB) విడుదల చేసింది. సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్‌ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్‌లో slprbap.obj@gmail.comకు మెయిల్‌లో పంపాలని సూచించింది. అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెలువరించనున్నారు. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://slprb.ap.gov.in/ అందుబాటులో ఉంచారు. 

పేపర్‌ -III ప్రిలిమినరీ కీ కోసం క్లిక్‌ చేయండి


పేపర్‌- IV ప్రిలిమినరీ కీ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని