APSLPRB: ఏపీలో ఎస్సై ఫిజికల్‌ ఈవెంట్స్‌కు తేదీలు ఖరారు

ఏపీలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి దేహదారుఢ్య పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. దీనికి సంబంధించిన హాల్‌ టికెట్లు ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. 

Updated : 11 Aug 2023 20:38 IST

అమరావతి: ఏపీలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్‌ ఈవెంట్ల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 28 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం కాల్‌లెటర్లను ఆగస్టు 14 నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు గానూ ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించగా.. 1,51,288 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో 57,923 మంది అర్హత సాధించగా.. వీరిలో 56,116మంది స్టేజ్‌-2 ఆన్‌లైన్‌ ఫాంను సమర్పించారు. వీరిలో 47,926మంది పురుషులు ఉండగా.. 8190 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని