APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 పోస్టులకు మెరిట్‌ జాబితా వచ్చేసింది..

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్షకు సంబంధించిన మెరిట్‌ లిస్ట్‌ను అధికారులు విడుదల చేశారు. జిల్లాల వారీగా మెరిట్‌ లిస్ట్‌లను ఇక్కడ పొందొచ్చు.

Published : 12 May 2023 21:08 IST

అమరావతి: రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌(గ్రూప్-4 సర్వీస్‌, ప్రకటన నం.23/2021) పోస్టులకు APPSC నిర్వహించిన ప్రధాన పరీక్ష మెరిట్‌ జాబితా విడుదలైంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను ఏపీపీఎస్సీ జిల్లాల వారీగా ప్రకటించింది. ఏప్రిల్‌ 4న రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష సమాధానాల ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీని విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. జిల్లాల వారీగా మెరిట్‌ జాబితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. నియామకాల తదుపరి ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేయనున్నారు.

జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్‌లు..

శ్రీకాకుళం

విజయనగరం

విశాఖపట్నం

తూర్పుగోదావరి

పశ్చిమగోదావరి

కృష్ణా

గుంటూరు

ప్రకాశం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు

చిత్తూరు

డా. వైఎస్‌ఆర్‌ కడప

అనంతపూర్‌

కర్నూలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని