APPSC: గ్రూప్‌-1 తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. టాప్‌ 5 ర్యాంకర్లు వీరే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 17 Aug 2023 17:40 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్ గురువారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 111 గ్రూప్‌-1 ఉద్యోగాలకు గాను 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్‌ కోటాలో ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్సు కోటాలో ఒక పోస్టు నియామకంపై త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ తెలిపారు. గ్రూప్‌-1లో తొలి 3 ర్యాంకులు మహిళా అభ్యర్థులే సాధించారు..

గ్రూప్-1లో టాప్‌ 5 ర్యాంకర్లు వీరే..

  • మొదటి ర్యాంకు - భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష
  • రెండో ర్యాంకు - భూమిరెడ్డి భవాని
  • మూడో ర్యాంకు - కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న
  • నాలుగో ర్యాంకు - ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి 
  • ఐదో ర్యాంకు - భాను ప్రకాష్ రెడ్డి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని