New Curriculum Framework: ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు: కేంద్ర విద్యాశాఖ

ఇంటర్‌ బోర్డు పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించింది.

Updated : 23 Aug 2023 17:12 IST

దిల్లీ: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థ(Education System)లో కేంద్రం పలు కీలక మార్పులకు సిద్ధమైంది. బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేలా కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌(New Curriculum Framework)ను కేంద్ర విద్యాశాఖ రూపొందించింది. దీనిప్రకారం.. విద్యార్థులు ఇకపై రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయడంతో పాటు ఆయా సబ్జెక్టుల్లో సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకొనే అవకాశం కలగనుంది. ఇలా ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు వారి స్కోరును మెరుగుపరుచుకొనేందుకు అవకాశం లభిస్తుందని విద్యాశాఖ పేర్కొంది. అలాగే, 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లను కచ్చితంగా అభ్యసించాలని.. వీటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని స్పష్టం చేసింది.

నూతన విద్యా విధానానికి (NEP)కి అనుగుణంగానే 2024 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బట్టీ చదువులకు స్వస్తిచెప్పేలా కొత్త పరీక్షల విధానం ఉంటుందని తెలిపింది. అలాగే, నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం..  11, 12 తరగతులలోని సబ్జెక్టుల ఎంపిక కేవలం ఆర్ట్స్‌, సైన్స్, కామర్స్‌ వంటి గ్రూపులకు మాత్రమే పరిమితం కాదని పేర్కొంది. ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ప్రిపేర్‌ అయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు మంచి పనితీరు కనబరిచేందుకు వీలుగా నూతన పాఠ్యప్రణాళిక రూపకల్పన చేశారు. సబ్జెక్టులపై పూర్తి అవగాహన, ప్రాక్టికల్ నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా దృష్టిసారిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని