CBSE Resuls: సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ సమాచారం ఫేక్‌.. బోర్డు ప్రకటన

లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఈనెల 11న విడుదలవుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది.

Updated : 10 May 2023 19:51 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ(CBSE) 10, 12 తరగతుల ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న వేళ సామాజిక మాధ్యమాల్లో నకిలీ సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ నెల 11న (గురువారం) సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల కాబోతున్నాయంటూ బోర్డు డైరెక్టర్‌ జోసెఫ్‌ ఇమ్మాన్యుయేల్‌ సంతకంతో  ఓ నోటీసు సర్క్యులేట్‌ అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫలితాల విడుదలపై అలాంటి లెటర్‌ ఏమీ తాము విడుదల చేయలేదని స్పష్టంచేశారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ బోర్డు ఫ్యాక్ట్‌చెక్‌ పేరిట ఓ ట్వీట్‌ చేసింది. అయితే, సీబీఎస్‌ఈ ఫలితాలను ఎప్పుడు విడుదల చేసేది మాత్రం వెల్లడించలేదు. 

మరోవైపు, సీబీఎస్‌ఈ ఫలితాలు అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు  సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో తమ రోల్‌ నంబర్‌, అడ్మిట్‌ కార్డు ఐడీ, స్కూల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్‌, ఉమాంగ్ యాప్‌లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా ఫలితాలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 5వరకు జరిగిన 10, 12వ తరగతి పరీక్షలను దేశవ్యాప్తంగా దాదాపు 37లక్షల మందికి పైగా రాశారు.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని