CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షల టైం టేబుల్‌ వచ్చేసింది..

లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల డేట్‌ షీట్లు విడుదలయ్యాయి.

Updated : 12 Dec 2023 18:55 IST

CBSE 10 Exams Date sheet 2024| దిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ(CBSE) 10, 12 తరగతుల పరీక్షల టైం టేబుల్‌ వచ్చేసింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరుగుతాయని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE)  ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్‌ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్‌ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్‌ షీట్‌లను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్‌ డా.సన్యం భరద్వాజ్‌ తెలిపారు. 

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల టైం టేబుల్‌ ఇదే..

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల టైం టేబుల్‌ ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని