CTET results: సీటెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

CBSE CTET Results: సీటెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఫలితాలు పొందొచ్చు.

Updated : 25 Sep 2023 14:50 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) ఏటా నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (CTET AUG- Results)విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) సోమవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను  ctet.nic.in వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా రోల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలను పొందొచ్చు.

ఆగస్టు 20న ఈ పరీక్షను దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో నిర్వహించగా దాదాపు 29లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.  మొత్తం రెండు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి పేపర్‌ 1 (1 నుంచి ఐదో తరగతి వరకు బోదించేవారు)కు 15,01,719మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. పేపర్‌- 2 (6 నుంచి 9వ తరగతి వరకు)కు 14,02,184మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. 80శాతానికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. సెప్టెంబర్‌ 16న ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరించిన అనంతరం తాజాగా ఫలితాలు విడుదల చేశారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది.

సీటెట్ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని