CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు..

CBSE Exams: సీబీఎస్‌ 10, 12వ తరగతి పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. రివైజ్‌ చేసిన షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది.

Published : 05 Jan 2024 12:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీబీఎస్‌ఈ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల డేట్‌ షీట్‌ను బోర్డు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ టైం టేబుల్‌ (Time Table)లో కొన్ని మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్‌ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్‌ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది.

10వ తరగతి షెడ్యూల్‌లో ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్‌ పేపర్‌ను ఫిబ్రవరి 28వ తేదీకి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్‌, ఫ్రెంచ్‌ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్‌, ఫిబ్రవరి 23న టిబెటన్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక, 12వ తరగతిలో కేవలం ఫ్యాషన్‌ స్టడీస్‌ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్చారు.

పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్‌ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్‌ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్‌ షీట్‌లను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్‌ డా.సన్యం భరద్వాజ్‌ గతంలో వెల్లడించారు.

సీబీఎస్‌ఈ 10వ తరగతి రివైజ్డ్‌ టైం టేబుల్ ఇదే..

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని