CPGET Results: సీపీగెట్‌ ఫలితాలకు డేట్‌ ఫిక్స్‌..

వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న సీపీగెట్‌ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. 

Updated : 21 Aug 2023 18:48 IST

హైదరాబాద్‌: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌)-2023 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం (ఆగస్టు 22) మధ్యాహ్నం 3.30గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ డి.రవీందర్‌ ఈ ఫలితాలను విడుదల చేస్తారని సీపీగెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ.పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫలితాలను https://cpget.tsche.ac.in/CPGET/CPGET_HomePage.aspx www.eenadu.netలో తెలుసుకోవచ్చు.

రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ వర్సిటీ, శాతవాహన వర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ హైదరాబాద్‌తో కలిపి మొత్తం ఎనిమిది యూనివర్సిటీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్‌, పీజీ డిప్లమా కోర్సులు కలిపి 45 కోర్సుల్లో ప్రవేశాలకోసం ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. CPGET పరీక్షలు జూన్‌ 30 నుంచి జులై 10 వరరకు సీబీటీ ద్వారా నిర్వహించగా.. 60,443మంది విద్యార్థులు హాజరయ్యారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు