Current affairs: కరెంట్‌ అఫైర్స్‌

భారతదేశం నుంచి సూపర్‌సోనిక్‌ బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశంగా ఏది నిలిచింది? (దాదాపు 375 మిలియన్‌ డాలర్లతో మిస్సైల్స్‌ కొనుగోలు చేసేందుకు ఈ దేశం ఒప్పందం కుదుర్చుకుంది.)

Updated : 24 May 2024 01:08 IST

మాదిరి ప్రశ్నలు

భారతదేశం నుంచి సూపర్‌సోనిక్‌ బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశంగా ఏది నిలిచింది? (దాదాపు 375 మిలియన్‌ డాలర్లతో మిస్సైల్స్‌ కొనుగోలు చేసేందుకు ఈ దేశం ఒప్పందం కుదుర్చుకుంది.)

జ: ఫిలిప్పీన్స్‌


భారత్, రష్యా జాయింట్‌ వెంచర్‌గా ఉన్న బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ మన దేశంలోనే రూపొందిస్తున్న బ్రహ్మోస్‌ క్షిపణులను ఎంత మొత్తంతో 200 క్షిపణులను కొనుగోలు చేసేందుకు బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ఒప్పందం చేసుకుంది? (అత్యంత శక్తిమంతమైన, భారత నౌకాదళ ప్రధాన ఆయుధమైన బ్రహ్మోస్‌ క్షిపణులను ప్రతి యుద్ధ నౌకలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన భారత రక్షణ శాఖ ఈ ఒప్పందం చేసుకుంది.)

జ: రూ.19 వేల కోట్లు


ప్రపంచ వ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలసబాట పట్టే అసంఖ్యాక జీవజాతులపై ఐక్యరాజ్యసమితి తొలిసారిగా నిర్వహించిన సమగ్ర అధ్యయనం ప్రకారం ఎంత శాతం జీవజాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్లు తేలింది?(అధ్యయనంలో భాగంగా 1979 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1189 జీవజాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను, 5000 పై చిలుకు జీవజాతుల తీరు తెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌)’, లివింగ్‌ పాన్లెట్‌ ఇండెక్స్‌  సంస్థల గణంకాల సాయంతో విశ్లేషించారు.)

జ: 22 శాతం



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని