కరెంట్‌ అఫైర్స్‌

భారత్‌ తన తొలి అణు పరీక్ష పోఖ్రాన్‌-1ను నిర్వహించి 50 ఏళ్లు పూర్తయింది. 1974 మే 18న దీన్ని నిర్వహించారు. తద్వారా అణుపరీక్షలో సత్తాచాటిన యూఎస్, సోవియట్‌ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన భారత్‌ నిలిచింది.

Published : 20 May 2024 00:57 IST

భారత్‌ తన తొలి అణు పరీక్ష పోఖ్రాన్‌-1ను నిర్వహించి 50 ఏళ్లు పూర్తయింది. 1974 మే 18న దీన్ని నిర్వహించారు. తద్వారా అణుపరీక్షలో సత్తాచాటిన యూఎస్, సోవియట్‌ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన భారత్‌ నిలిచింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంలేని దేశం అణు పరీక్ష నిర్వహించడం అదే మొదటిసారి. ఈ పరీక్షకు ‘ఆపరేషన్‌ స్మైలింగ్‌ బుద్ధా’ అని పేరు పెట్టారు. విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్‌-1గా పేర్కొంది.


యేల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ కమ్యూనికేషన్, సీఓటర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా ‘క్లైమేట్‌ ఛేంజ్‌ ఇన్‌ ది ఇండియన్‌ మైండ్‌ - 2023’ నివేదికను అమెరికాలో విడుదల చేశాయి. భారత్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. భారతదేశానికి భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.


వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ డే (ప్రపంచ రక్తపోటు రోజు)ను ఏటా మే 17న నిర్వహిస్తారు. దీన్ని 2006 నుంచి నిర్వహిస్తున్నారు. ఆగ్నేయాసియాలో 29.4 కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

2024 థీమ్‌: Measure your blood Pressure accurately,Control it and Live Longer). (‘మీ రక్తపోటును కచ్చితత్వంతో తెలుసుకోండి. దాన్ని నియంత్రించి ఎక్కువ కాలం జీవించండి’)

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని