Current Affairs: కరెంట్‌ అఫైర్స్‌

అమెరికా లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఇటీవల ప్రదానం చేసిన 96వ ఆస్కార్‌ అవార్డుల్లో ఏ చిత్రం అత్యధికంగా ఏడు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది?

Published : 26 May 2024 00:20 IST

  •  అమెరికా లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఇటీవల ప్రదానం చేసిన 96వ ఆస్కార్‌ అవార్డుల్లో ఏ చిత్రం అత్యధికంగా ఏడు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది? (ప్రముఖ అమెరికన్‌ దర్శకుడు క్రిస్టఫర్‌ నోలన్‌ అణుబాంబు సృష్టికర్త జె.రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్‌ జీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (సిలియన్‌ మర్ఫీ), ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లో ఈ చిత్రం పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ నటిగా ‘పూర్‌ థింగ్స్‌’ చిత్రంలోని నటనకు ఎమ్మాస్టోన్‌ అవార్డు అందుకున్నారు.)

 జ: ఓపెన్‌ హైమర్‌

  •  పౌరసత్వ (సవరణ) చట్టం-2019 కింద భారత పౌరసత్వం పొందాలని భావించే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ కాందిశీకుల కోసం భారత ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పోర్టల్‌ ఏది?

జ: indiancitizenshiponline.nic.in

  • భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎన్‌)లో ఆరున్నర నెలలకు పైగా విధులు నిర్వహించిన ఏ నలుగురు వ్యోమగాములు 2024, మార్చి 12న సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు? (స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సూల్‌ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో జలాల్లో వీరు కిందకు దిగారు. 2023, ఆగస్టు 26న ‘స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9’  రాకెట్‌లో వీరు రోదసిలోకి వెళ్లి తాజాగా తిరిగి వచ్చారు.)

జ: జాస్మిన్‌ మాగ్‌బెలి (అమెరికా), ఆండ్రియాస్‌ మోగెన్‌సెన్‌ (డెన్మార్క్‌), సతోషి పురుకవా (జపాన్‌), కాన్‌స్టాంటిన్‌ బొరిసోవ్‌ (రష్యా)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని