Current Affairs: కరెంట్‌ అఫైర్స్‌

భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ - 2024ను ఏ జట్టు సొంతం చేసుకుంది? (ముంబయిలో జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 169 పరుగుల తేడాతో రెండు సార్లు ఛాంపియన్‌ విదర్భపై ఘన విజయం సాధించింది.

Published : 28 May 2024 01:02 IST

మాదిరి ప్రశ్నలు

  • భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ - 2024ను ఏ జట్టు సొంతం చేసుకుంది? (ముంబయిలో జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 169 పరుగుల తేడాతో రెండు సార్లు ఛాంపియన్‌ విదర్భపై ఘన విజయం సాధించింది. ఈ జట్టు రికార్డు స్థాయిలో 42వ సారి రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 1934 - 35 సీజన్‌లో తొలిసారి విజేతగా నిలిచిన ఈ జట్టు తాజా టైటిల్‌కు ముందు 2015-16   సీజన్‌లో చివరిసారి ట్రోఫీని అందుకుంది.)

జ: ముంబయి


  • భారత ఉపాధి నివేదిక - 2024 గణాంకాల ప్రకారం 2011లో దేశంలో పనిచేసే వర్గం 61 శాతం ఉండగా, 2021 నాటికి అది ఎంత శాతానికి పెరిగింది?  (భారత్‌లో నిరుద్యోగ సమస్యపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), మానవాభివృద్ధి సంస్థ (ఐహెచ్‌డీ - ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌)లు సంయుక్తంగా అధ్యయనం చేపట్టి భారత ఉపాధి నివేదిక - 2024 పేరిట ఆ  ఫలితాలను వెల్లడించాయి. 15 నుంచి 59 ఏళ్ల వయసువారిని పనిచేసే వర్గంగా పరిగణిస్తారు. ఏటా 78 లక్షల మంది శ్రామిక శక్తికి జత పడుతున్నప్పటికీ, నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వారిలో 83 శాతం యువతే ఉంటోందని నివేదిక  ఆందోళన వ్యక్తం చేసింది.)

జ: 65 శాతం


  • కేంద్ర జల సంఘం అంచనా ప్రకారం దేశంలో   తలసరి నీటి లభ్యత 2050 నాటికి ఎన్ని ఘనపు   మీటర్లుగా ఉంటుంది? (ఇండియాలో 2001లో సగటు వార్షిక తలసరి నీటి లభ్యత 1816 ఘనపు మీటర్లు. 2011లో అది 1544 ఘనపు మీటర్లకు పడిపోయింది.)  

జ: 1140 ఘనపు మీటర్లు


  • ఎంత మొత్తం వ్యయంతో దేశంలో మూడు సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్లను స్థాపించాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది?(ఇందులో రెండు గుజరాత్, ఒకటి అస్సాంలో ఏర్పాటు కానున్నాయి.)   

జ: రూ.1.25 లక్షల కోట్లు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని