current affairs: కరెంట్‌ అఫైర్స్‌

ఈ ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు పతాకధారిగా ఏ క్రీడాకారుడిని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఎంపిక చేసింది? 

Published : 30 May 2024 00:40 IST

మాదిరి ప్రశ్నలు

ఈ ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు పతాకధారిగా ఏ క్రీడాకారుడిని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఎంపిక చేసింది? 

జ: ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు ఆచంట శరత్‌ కమల్‌ (శరత్‌ కమల్‌కు ఇది అయిదో ఒలింపిక్స్‌. ఇదే తన చివరి ఒలింపిక్స్‌ క్రీడలని శరత్‌ ప్రకటించాడు. 2022 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ముగింపు వేడుకల్లో కూడా భారత పతాకధారిగా శరత్‌ కమల్‌ వ్యవహరించారు.)

భారత్‌లో 2023 సెప్టెంబరు చివరకు రూ.157.84 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం ప్రభుత్వ రుణ భారం డిసెంబరు చివరి నాటికి ఎంత మొత్తానికి పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజా నివేదిక వెల్లడించింది? (రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్వదేశీ, విదేశీ రుణాలను కలిపి ప్రభుత్వ రుణ భారంగా పరిగణిస్తారు. పాతరుణాలపై వడ్డీ, అసలు చెల్లింపులు కూడా దీనిలో భాగమే. ఇంకా భవిష్యనిధి, చిన్నమొత్తాల పొదుపు చెల్లింపులు, భారత ఆహార సంస్థ, చమురు కంపెనీలు జారీ చేసిన ప్రత్యేక సెక్యూరిటీలకు జరపాల్సిన చెల్లింపులు కూడా ప్రభుత్వ రుణభారంలో అంతర్భాగమే.)

జ: రూ.160.69 లక్షల కోట్లు

భారత్‌లో 2018-19 జీడీపీలో 48.1 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రుణభారం 2023-24 నాటికి ఎంత శాతానికి పెరిగింది? (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు రుణాలు తీసుకోవచ్చో నిర్దేశించే ద్రవ్యపరమైన బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని 2003లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2024-25 నాటికి స్థూల ప్రభుత్వ రుణాన్ని దేశ జీడీపీలో 60 శాతానికి పరిమితం చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. అందులో కేంద్ర ప్రభుత్వ రుణాలు 40 శాతానికి మించరాదు. 2024-25లో కేంద్ర ప్రభుత్వ రుణభారం జీడీపీలో 56 శాతంగా ఉంటుందని అంచనా.)

జ: 56.9 శాతం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని