DRDO Recruitment: బీటెక్‌తో సైంటిస్ట్‌ ‘బి’ ఉద్యోగాలు.. ₹లక్ష వరకూ వేతనం!

ఇంజినీరింగ్‌ పూర్తి చేసి గేట్‌లో మంచి స్కోరు సాధించిన విద్యార్థులకు సువర్ణావకాశం. భారీ వేతనాలతో డీఆర్‌డీవోలో సైంటిస్ట్‌ ‘బి’ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Updated : 11 Aug 2023 19:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంజినీరింగ్‌ పూర్తి చేసి గేట్‌లో మంచి స్కోరు సాధించిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (DRDO)లోని సైంటిస్ట్‌ ‘బి’ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలు కాగా.. ఆగస్టు 31వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.drdo.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • మొత్తం 204 సైంటిస్ట్‌ ‘బి’ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా..  వీటిలో డీఆర్‌డీవోలో 181, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ)లో 11, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ)లో 6, కాలేజ్‌ ఆఫ్‌ మిలటరీ ఇంజినీరింగ్‌( సీఎంఈ)లో ఆరు చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు వయో పరిమితి విధించారు. అన్‌రిజర్వుడ్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 35 ఏళ్లు మించరాదు. అలాగే, ఓబీసీ (నాన్‌ క్రిమీలేయర్‌ -28 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 40 ఏళ్లు వయోపరిమితి విధించారు. 
  • దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.100ల చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు మినహాయింపు కల్పించారు.
  • దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు గేట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ  నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. గేట్‌లో స్కోరుకు 80శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 20శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. 
  • ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులు సాధించిన గేట్‌ స్కోరు ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 
  • ఉద్యోగానికి ఎంపికైన తర్వాత మెట్రో  నగరాల్లో నెలకు దాదాపు రూ.లక్ష వరకు వేతనం అందజేస్తారు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు