General studies: ట్రెండ్‌ చెప్పే చిత్రాలు!

ఒక కంపెనీ పది రకాల వస్తువులను విక్రయిస్తుంది. సంవత్సర కాలంలో అన్నింటి గణాంకాలను పోల్చి చూసుకొని వాటి అమ్మకాల స్వరూపాన్ని వెంటనే తెలుసుకోవాలంటే కాస్త కష్టం. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధించిన మార్కుల తీరును గుర్తించేందుకు లెక్కలు వేస్తూ కూర్చుంటే చాలా సమయం వృథా అవుతుంది.

Published : 30 May 2024 00:52 IST

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

ఒక కంపెనీ పది రకాల వస్తువులను విక్రయిస్తుంది. సంవత్సర కాలంలో అన్నింటి గణాంకాలను పోల్చి చూసుకొని వాటి అమ్మకాల స్వరూపాన్ని వెంటనే తెలుసుకోవాలంటే కాస్త కష్టం. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధించిన మార్కుల తీరును గుర్తించేందుకు లెక్కలు వేస్తూ కూర్చుంటే చాలా సమయం వృథా అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో దత్తాంశ విశ్లేషణలోని కమ్మీ రేఖా చిత్రాలను ఉపయోగిస్తే నిర్దిష్ట కాలవ్యవధుల్లో డేటా మారుతున్న విధానాన్ని అవి స్పష్టంగా ప్రదర్శిస్తాయి. చూడగానే సంబంధిత నమూనాలు, ట్రెండ్‌ (ధోరణులు) సులభంగా అర్థమవుతాయి. వేర్వేరు వర్గాలు లేదా సమూహాల మధ్య సంబంధాలను వేగంగా గ్రహించగలిగే సామర్థ్యాన్ని అభ్యర్థుల్లో అంచనా వేయడానికి రీజనింగ్‌లో వీటిపై ప్రశ్నలు అడుగుతుంటారు. మౌలికాంశాలను, కొన్ని గణిత పరిక్రియలను నేర్చుకొని ప్రాక్టీస్‌ చేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవచ్చు.

కమ్మీరేఖా చిత్రాలు (డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) 

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (దత్తాంశ విశ్లేషణ)లో భాగంగా వచ్చే కమ్మీరేఖా చిత్రాలు (బార్‌ డయాగ్రమ్స్‌) దీర్ఘచతురస్రాల రూపంలో ఉంటాయి. ఆ దీర్ఘచతురస్రంలో వెడల్పు తరగతి అంతరాన్ని, పొడవు పౌనఃపున్యాన్ని సూచిస్తాయి. ప్రశ్నలో ఇచ్చిన కమ్మీరేఖా చిత్రాల పొడవు, వెడల్పులను ఆధారంగా చేసుకుని డేటాను గ్రహించి ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని