పదితో పారిశ్రామిక రక్షణ దళంలోకి!

తాజాగా 787 కానిస్టేబుల్‌/ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి సీఐఎస్‌ఎఫ్‌ ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి పాసైన స్త్రీ, పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 28 Nov 2022 04:52 IST

తాజాగా 787 కానిస్టేబుల్‌/ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి సీఐఎస్‌ఎఫ్‌ ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి పాసైన స్త్రీ, పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో లేదా దేశం వెలుపల పనిచేయడానికి సిద్ధపడాలి.

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) దేశంలోని సుమారు 356 పారిశ్రామిక యూనిట్లకు (దీంట్లో 13 ప్రైవేట్‌ సెక్టర్‌ యూనిట్లు) సెక్టర్లవారీగా రక్షణ కల్పిస్తోంది. వీటిట్లో అత్యంత ముఖ్యమైన అణుశక్తి ప్లాంట్లు, స్పేస్‌ ఇన్‌స్టలేషన్స్‌, మైన్స్‌, ఆయిల్‌ ఫీల్డ్స్‌ అండ్‌ రిఫైనరీస్‌, ప్రధాన ఓడరేవులు, స్టీల్‌ప్లాంట్లు, బ్యారేజ్‌లు, ఫెర్టిలైజర్‌ యూనిట్లు, ఎయిర్‌ పోర్టులు, హైడ్రో ఎలక్ట్రిక్‌/ థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, కరెన్సీ నోట్‌ ప్రెస్‌లు ఉన్నాయి. హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కేంద్రం న్యూదిల్లీలో ఉంది. సుమారు 1,80,000 మంది ఉద్యోగులు దీంట్లో పనిచేస్తున్నారు.


ఏయే ఖాళీలు?

కానిస్టేబుల్‌/కుక్‌ - 304, కానిస్టేబుల్‌/కోబ్లర్‌ - 06, కానిస్టేబుల్‌/ టైలర్‌ - 27, కానిస్టేబుల్‌/ బార్బర్‌ - 102, కానిస్టేబుల్‌/ వాషర్‌మ్యాన్‌ - 118, కానిస్టేబుల్‌/ స్వీపర్‌- 199, కానిస్టేబుల్‌/ పెయింటర్‌- 01, కానిస్టేబుల్‌/ మేసన్‌- 12, కానిస్టేబుల్‌/ ప్లంబర్‌- 04, కానిస్టేబుల్‌/ మాలి - 03, కానిస్టేబుల్‌/ వెల్డర్‌- 03 పోస్టులు ఉన్నాయి. బ్యాక్‌లాగ్‌వి కానిస్టేబుల్‌/ కోబ్లర్‌-01, కానిస్టేబుల్‌/ బార్బర్‌- 07 కలిపి మొత్తం 787 ఖాళీలు ఉన్నాయి.
వీటిల్లో పురుషులకు 641, స్త్రీలకు 69, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 77 కేటాయించారు. ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌కు కేటాయించిన పోస్టుల్లో కానిస్టేబుల్‌/కుక్‌-30, కానిస్టేబుల్‌/కోబ్లర్‌-1, కానిస్టేబుల్‌/టైలర్‌-3, కానిస్టేబుల్‌/బార్బర్‌-10, కానిస్టేబుల్‌/వాషర్‌మెన్‌-12, కానిస్టేబుల్‌/స్వీపర్‌-20, కానిస్టేబుల్‌/మేసన్‌-1 ఉన్నాయి.
అర్హత: పదో తరగతి పాసవ్వాలి. ఐటీఐ శిక్షణ పొందినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 01.08.2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1999 ముందు 01.08.2004 తర్వాతా పుట్టినవాళ్లు దరఖాస్తుకు అర్హులు కారు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.


శారీరక ప్రమాణాలు

పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్టీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థుల ఎత్తు 162.5, ఛాతీ 76-81 సెం.మీ. ఉండాలి. ఎస్టీకి చెందిన మహిళా అభ్యర్థుల ఎత్తు 150 సెం.మీ. ఉండాలి. పర్వత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ కొలతల్లో సడలింపు ఉంటుంది.  
ఎంపిక: అభ్యర్థులను ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ), డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ఓఎంఆర్‌ బేస్డ్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పీఎస్‌టీ/ పీఈటీ/ డాక్యుమెంటేషన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపికచేస్తారు. ఈ పరీక్ష ఓఎంఆర్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


 రాత పరీక్షలో...

ఈ పరీక్షలో 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. పరీక్ష వ్యవధి 2 గంటలు. జనరల్‌ అవేర్‌నెస్‌/ జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాయొచ్చు. రాత పరీక్షలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను తర్వాతి దశకు ఎంపికచేస్తారు. అన్‌ రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 35 శాతం. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి.

ముఖ్యాంశాలు: ఒకరు ఒక ట్రేడ్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. అన్ని ట్రేడ్‌లకు సంబంధించిన ట్రేడ్‌ టెస్ట్‌, రిటెన్‌ టెస్టులను వేర్వేరు ప్రదేశాల్లో ఒకే సమయంలో నిర్వహిస్తారు. ఒకరు ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులను పంపితే అన్ని దరఖాస్తులనూ తిరస్కరిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తును నింపేటప్పుడు ఐటెంటిటీ కార్డ్‌ నంబర్‌(ఆధార్‌ నంబర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబర్‌, ఓటర్‌ ఐడీకార్డ్‌, యూనివర్సిటీ/ కాలేజీ జారీచేసిన ఐటెంటిటీ కార్డ్‌ లేదా పాన్‌కార్డ్‌ నంబర్‌) నమోదు చేయాలి.
* పీఎస్‌టీ/పీఈటీ/డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌ సమయంలో అభ్యర్థులు విద్యార్హతలు/ అనుభవం/ కుల ధ్రువీకరణను తెలిపే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి.
* ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌, రిటెన్‌ టెస్ట్‌లను సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన వివిధ నియామక కేంద్రాల్లో నిర్వహిస్తారు.
* కాల్‌ అప్‌ లెటర్‌/ అడ్మిట్‌ కార్డ్‌ను సీఐఎస్‌ఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పీఎస్‌టీ/పీఈటీ, డాక్యుమెంటేషన్‌ అండ్‌ ట్రేడ్‌టెస్ట్‌, రిటెన్‌, మెడికల్‌ ఎగ్జామ్‌లకు సంబంధించిన తేదీల కోసం అభ్యర్థులు తరచూ వెబ్‌సైట్‌ చూస్తుండాలి.
* అప్లికేషన్‌ ప్రింటవుట్‌ను అభ్యర్థులు తమ దగ్గర భద్రపరుచుకోవాలి. పోస్టులో పంపాల్సిన పనిలేదు.
* మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు ముందు పీఎస్‌టీ/పీఈటీ, డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌టెస్ట్‌, ఓఎంఆర్‌/ సీబీటీ విధానంలో రాతపరీక్ష ఉంటాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20.12.2022
వెబ్‌సైట్‌: https://cisfrectt.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని