IGNOU: మేటి కోర్సుల మేళా!

దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు దూర  విద్యలో చదువులు అందిస్తున్నాయి. వాటిలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందించే కోర్సులు ఎంతో ప్రత్యేకమైనవి.

Updated : 17 Jan 2023 03:54 IST

ఇగ్నో దూరవిద్యకు ఇది ప్రవేశాల వేళ

దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు దూర  విద్యలో చదువులు అందిస్తున్నాయి. వాటిలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందించే కోర్సులు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ సంస్థ విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి ఆశించేవారు... ఇలా అందరికీ సరిపోయే చదువులెన్నో నేర్పుతోంది. తక్కువ  విద్యార్హతలతోనూ పలు కోర్సులు ఉన్నాయి. మాతృభాషలోనూ అధ్యయనం కొనసాగించవచ్చు. ఏడాదికి రెండుసార్లు ప్రవేశం  లభిస్తుంది. ప్రస్తుతం జనవరి సెషన్‌  ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్నో.. పోస్టు గ్రాడ్యుయేషన్‌, గ్రాడ్యుయేషన్‌, పీజీ డిప్లొమా, డిప్లొమా, పీజీ సర్టిఫికెట్‌, అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికెట్‌, సర్టిఫికెట్‌, అవేర్‌నెస్‌ ప్రోగ్రాములు అందిస్తోంది. టీవీ ఛానెళ్లలోనూ ఈ సంస్థ అందించే వీడియో పాఠాలు వీక్షించవచ్చు. నేరుగా విద్యాసంస్థల్లో చదవడం వీలుకానివారు, రెగ్యులర్‌ విధానంలో ఆ కోర్సులు అందుబాటులో లేకపోయినా ఇగ్నోవైపు చూడవచ్చు.

ఇందులో ఆర్ట్స్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌, లాంగ్వేజెస్‌, సోషల్‌ సైన్సెస్‌, మెడిసిన్‌, న్యూట్రిషన్‌, నర్సింగ్‌, అగ్రికల్చర్‌, లా... ఇలా రంగాలూ, వృత్తులవారీ కోర్సులు ఉన్నాయి. స్వయం ఉపాధి దిశగా పౌల్ట్రీ, డెయిరీ ఫార్మింగ్‌.. మొదలైనవి తెలుగు మాధ్యమంలోనూ అందిస్తున్నారు. ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మార్కెటింగ్‌ నిపుణులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, టూర్‌ ప్లానర్స్‌, అకౌంటెంట్స్‌...ఇలా అన్ని వృత్తులు, రంగాలకు ఉపయోగపడే కోర్సులు వివిధ స్థాయుల్లో లభిస్తున్నాయి. పీజీ, పీజీ డిప్లొమా కోర్సులకు యూజీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కోర్సులకు మాత్రం సంబంధిత/ అనుబంధ విభాగాలను యూజీలో పూర్తిచేసుకున్నవారికే అవకాశం ఉంటుంది. యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లోకి ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో చేరిపోవచ్చు.

ఇవీ కోర్సులు

ఎంకాం: జనరల్‌, ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌.
ఎంబీఏ: జనరల్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌.
ఎమ్మే: ఉర్దూ, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సోషియాలజీ, సైకాలజీ, ఎకనామిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రొపాలజీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, సోషల్‌ వర్క్‌, సోషల్‌ వర్క్‌(కౌన్సెలింగ్‌), ఎడ్యుకేషన్‌, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, ఫిలాసఫీ, ఫోక్‌లోర్‌ అండ్‌ కల్చర్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌, సస్టెయినబిలిటీ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, అర్బన్‌ స్టడీస్‌, విమెన్‌ అండ్‌ జెండర్‌ స్టడీస్‌, జెండర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, జర్నలిజం అండ్‌ డిజిటల్‌ మీడియా, జర్నలిజం అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, డెవలప్‌మెంట్‌ జర్నలిజం, అరబిక్‌, రష్యన్‌.

ఎమ్మెస్సీ: ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌ విత్‌ అప్లికేషన్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌లతోపాటు ఎంఎల్‌ఐఎస్సీ, ఎంసీఏ

యూజీ: బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ, బీఎల్‌ఐఎస్సీ, బీఏ టూరిజం స్టడీస్‌, బీఎస్‌డబ్ల్యూ, బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (టూరిజం మేనేజ్‌మెంట్‌), బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. ఆనర్స్‌ విధానంలో బీఏ: ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, ఆంత్రొపాలజీ, ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, ఉర్దూ, కోర్సులను ఎంచుకోవచ్చు. బీఎస్సీ బయో కెమిస్ట్రీ, పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌ (హిందూస్థానీ మ్యూజిక్‌) కోర్సు అందిస్తున్నారు.

పీజీ సర్టిఫికెట్‌: సైబర్‌ లా, పేటెంట్‌ ప్రాక్టీస్‌,    క్లైమేట్‌ ఛేంజ్‌, జియో ఇన్ఫర్మాటిక్స్‌, పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, ఇన్వెంటరీ ప్లానింగ్‌ అండ్‌ వేర్‌హౌసింగ్‌ ఫర్‌ ఇంజినీర్స్‌, అగ్రికల్చర్‌ పాలసీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్‌, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ అసెస్టివ్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ ది ఇన్‌స్ట్రక్టర్స్‌ ఆఫ్‌ విజువల్లీ ఇంపైర్డ్‌.

డిప్లొమా: ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌, పంచాయత్‌ లెవల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం స్టడీస్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌, ఉర్దూ లాంగ్వేజ్‌, వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌, డెయిరీ టెక్నాలజీ, మీట్‌ టెక్నాలజీ, వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌, హార్టికల్చర్‌, విమెన్స్‌ ఎంపవరమెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌, బీపీవో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, మోడర్న్‌ ఆఫీస్‌ ప్రాక్టీస్‌, పారా లీగల్‌ ప్రాక్టీస్‌, ఆక్వాకల్చర్‌, రిటైలింగ్‌, టీచింగ్‌ జర్మన్‌ యాజ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌, నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌, క్రిటికల్‌ కేర్‌ నర్సింగ్‌, థియేటర్‌ ఆర్ట్స్‌, వాల్యూ ఎడ్యుకేషన్‌, స్మార్ట్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌.

సర్టిఫికెట్‌: లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, లైఫ్‌ అండ్‌ థాట్‌ ఆఫ్‌ డా. బీఆర్‌ అంబేడ్కర్‌, పీస్‌ స్టడీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, అపారల్‌ మర్చండైజింగ్‌, గైడెన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఎ సెకండ్‌ లాంగ్వేజ్‌, ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌, ఉర్దూ లాంగ్వేజ్‌, బిజినెస్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, సెరీ కల్చర్‌, ట్రైబల్‌ స్టడీస్‌, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, పౌల్ట్రీ ఫార్మింగ్‌, బీ కీపింగ్‌, విదేశీ భాషలు, ఫస్ట్‌ ఎయిడ్‌, యోగా, హెల్త్‌కేర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, పెయింటింగ్‌, అప్లయిడ్‌ ఆర్ట్‌, థియేటర్‌ ఆర్ట్స్‌.. ఇలా కోర్సులెన్నో ఉన్నాయి.

విస్తృత కోర్సులు, అందుబాటులో స్టడీ సెంటర్లు,ఆన్‌లైన్‌లో అభ్యసనానికి వీలు, కాంటాక్ట్‌ తరగతులు, సర్టిఫికెట్‌కు గుర్తింపు.. ఇగ్నో ప్రత్యేకతలు


విస్తృతంగా... పీజీ డిప్లొమాలు

రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ అండ్‌ ఫౌండేషనల్‌ స్టేజ్‌ ఎడ్యుకేషన్‌, ట్రాన్స్‌లేషన్‌, సింధీ-హిందీ-సింధీ ట్రాన్స్‌లేషన్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, జియో ఇన్ఫర్మాటిక్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, మెంటల్‌ హెల్త్‌, లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, స్కూల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, యానిమల్‌ వెల్ఫేర్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఆడియో ప్రోగ్రాం ప్రొడక్షన్‌, డిజిటల్‌ మీడియా, డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, అగ్రి బిజినెస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఫార్మాస్యూటికల్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, క్రిమినల్‌ జస్టిస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌, ఫోక్‌లోర్‌ అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌, సస్ట్టెయినబిలిటీ సైన్స్‌, మైగ్రేషన్‌ అండ్‌ డయాస్పొరా, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లా, విమెన్‌ అండ్‌ జెండర్‌ స్టడీస్‌, బుక్‌ పబ్లిషింగ్‌, రైటింగ్స్‌ ఫ్రం ఇండియా, బ్రిటిష్‌ లిటరేచర్‌, ది నావెల్‌, రైటింగ్స్‌ ఫ్రమ్‌ ది మార్జిన్స్‌, అమెరికన్‌ లిటరేచర్‌, న్యూ లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌, సోషల్‌ వర్క్‌ కౌన్సెలింగ్‌, హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, జెరియాట్రిక్‌ మెడిసిన్‌, మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌, హెచ్‌ఐవీ మెడిసిన్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌.


పౌల్ట్రీ, డెయిరీ

త్సాహికుల కోసం తెలుగు మాధ్యమంలో ఇగ్నో పౌల్ట్రీ ఫార్మింగ్‌ కోర్సు అందిస్తోంది. ఏడాది పొడవునా చేతికి ఆదాయం అందించడం పౌల్ట్రీ ప్రత్యేకత. ఈ రంగంలో సిరులు కురవాలంటే కోళ్ల పెంపకం, వాటి పోషణ, ఫారాల నిర్వహణపై శాస్త్రీయ అవగాహన తప్పనిసరి. ఆ దిశగా ఈ కోర్సు ఉపయోగపడుతుంది. కోర్సు వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.3600. ఎనిమిదో తరగతి విద్యార్హతతో ఇందులో చేరవచ్చు.

* ఇదే విద్యార్హతతో తేనె తయారీ కోసం బీ కీపింగ్‌ కోర్సును ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. 6 నెలల వ్యవధి గల ఈ కోర్సు ఫీజు రూ.1400.

* డెయిరీ ఫార్మింగ్‌ అవేర్‌నెస్‌ కోర్సును తెలుగు మాధ్యమంలో అందిస్తున్నారు. పాడిపరిశ్రమపై ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరవచ్చు. జంతువుల పెంపకం, రోగాల బారినుంచి వాటిని సంరక్షించడం, పాల దిగుబడి పెంచడం, దాణా ఎంచుకోవడం..తదితరాలు ఇందులో నేర్పుతారు. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. కోర్సు వ్యవధి 2 నెలలు. ఫీజు రూ.1100.

* డెయిరీ టెక్నాలజీ కోర్సు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో తెలుగు మాధ్యమంలోనూ అందిస్తున్నారు. వ్యవధి ఏడాది. కోర్సు ఫీజు రూ.15,200.
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31
వెబ్‌సైట్‌: 
http://ignou.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని