చక్కని అవకాశాలిచ్చే చక్కెర కోర్సులు

ఓ ఉత్పత్తి పూర్తవడం వెనుక ఎన్నో దశలుంటాయి. ఎందరో నిపుణుల సేవలు అవసరమవుతాయి. ఉత్పాదన క్రమంలో అనుబంధంగా మరికొన్ని అదనపు విలువైనవీ దక్కుతాయి. చెరకు నుంచి పంచదార రూపొందడం అలాంటిదే.

Published : 21 Mar 2024 00:33 IST

ఓ ఉత్పత్తి పూర్తవడం వెనుక ఎన్నో దశలుంటాయి. ఎందరో నిపుణుల సేవలు అవసరమవుతాయి. ఉత్పాదన క్రమంలో అనుబంధంగా మరికొన్ని అదనపు విలువైనవీ దక్కుతాయి. చెరకు నుంచి పంచదార రూపొందడం అలాంటిదే. ఈ ప్రక్రియపై ఆసక్తి ఉన్నవారు షుగర్‌ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి శ్రీకారం చుట్టవచ్చు. ఈ విభాగంలో దేశంలో పేరొందిన నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, కాన్పూర్‌ - పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆహ్వానం పలుకుతోంది...

కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలో ప్రతిభ చూపాలి. అవకాశం వచ్చిన వారికి స్కాలర్‌షిప్పులు, స్టైపెండ్‌ అందుతాయి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం సాధించవచ్చు.

పీజీ డిప్లొమాలు

షుగర్‌ టెక్నాలజీ

అర్హత: బీఎస్సీ ఎంపీసీ లేదా కెమికల్‌ ఇంజినీరింగ్‌

వ్యవధి: రెండున్నరేళ్లు.

సీట్లు: 66.

షుగర్‌ ఇంజినీరింగ్‌

అర్హత: బీటెక్‌ లేదా ఏఎంఐఈలో మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌ విభాగాలు.

వ్యవధి: 18 నెలలు.

సీట్లు: 40.

ఇండస్ట్రియల్‌ ఫర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ

అర్హత: బీఎస్సీలో కెమిస్ట్రీ/ అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. లేదా బీటెక్‌ బయోటెక్నాలజీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌/ బయో కెమికల్‌ ఇంజినీరింగ్‌.

వ్యవధి: 18 నెలలు.

సీట్లు: 50.

షుగర్‌ కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌

అర్హత: బీఎస్సీ లేదా బీఎస్సీ అగ్రికల్చర్‌.

వ్యవధి: ఏడాది.

సీట్లు: 20.

ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌

అర్హత: ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌...తదితర విభాగాల్లో బీటెక్‌ లేదా ఏఎంఐఈ.

వ్యవధి: ఏడాది.

సీట్లు: 17

క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఎన్వి రాన్‌మెంటల్‌ సైన్స్‌

అర్హత: బీఎస్సీ ఎంపీసీ లేదా బీజడ్‌సీ లేదా బీస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ లేదా బీఎస్సీ/బీటెక్‌ బయో టెక్నాలజీ.
వ్యవధి: ఏడాది.
సీట్లు: 22.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్‌ 8 నుంచి మే 24 సాయంత్రం 5 గంటల వరకు.
పోస్టుద్వారా ప్రింట్‌ అవుట్‌ స్వీకరణకు గడువు: మే 31 సాయంత్రం 5 గంటలు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.వెయ్యి. ఇతరులకు రూ.1500.
పరీక్ష తేదీ: జూన్‌ 23.
పరీక్ష కేంద్రాలు: పుణె, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, కాన్పూర్‌,    పట్నా.
వెబ్‌సైట్‌: https://nsi.gov.in/


సర్టిఫికెట్‌ కోర్సులు

షుగర్‌ బాయిలింగ్‌

అర్హత: పదో తరగతి. ఈ విభాగంలో అనుభవం ఉండాలి.

వ్యవధి: 18 నెలలు.

సీట్లు: 63

షుగర్‌ ఇంజినీరింగ్‌

అర్హత: మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో డిప్లొమా.

వ్యవధి: ఏడాది.

సీట్లు: 17.

క్వాలిటీ కంట్రోల్‌

అర్హత: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌.

వ్యవధి: 4 నెలలు.

సీట్లు: 30

ప్రవేశం: పై అన్ని కోర్సులకూ పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి.


ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ కోర్సులు

షుగర్‌  టెక్నాలజీ/ షుగర్‌ కెమిస్ట్రీ, షుగర్‌ ఇంజినీరింగ్‌, ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ... ఇవి ఇండస్ట్రీ స్పాన్సర్‌ చేసే ఫెలోషిప్‌ డిప్లొమా ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ) కోర్సులు. ఇంటర్వ్యూతో ప్రవేశాలుంటాయి.  

కోర్సులను పూర్తి చేసుకున్నవారికి పంచదార పరిశ్రమలు అనుబంధ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సును బట్టి ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు ఉంటాయి. ఈ సంస్థలో కోర్సులు పూర్తి చేసుకున్న వారికి జాతీయ స్థాయి పరిశ్రమలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలకీ వీలుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని