కరెంట్‌ అఫైర్స్‌

దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ‘మిసెస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని 2022 ఏడాదికి గాను ఎవరు దక్కించుకున్నారు?

Published : 27 Jan 2023 00:53 IST

మాదిరి ప్రశ్నలు

* దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ‘మిసెస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని 2022 ఏడాదికి గాను ఎవరు దక్కించుకున్నారు?

జ: సర్గమ్‌ కౌశల్‌ (ఈమె జమ్ముకశ్మీర్‌కు చెందినవారు. 21 ఏళ్ల కిందట భారత్‌ నుంచి డాక్టర్‌ అదితి గోవిత్రికర్‌ ఈ కిరీటాన్ని అందుకున్నారు.)


* 2022 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం దేశంలో బొగ్గు గనుల వేలంపాటను ప్రారôభించింది. ఇలా బొగ్గుగనుల వేలంపాట నిర్వహించడం ఇది ఎన్నోసారి? (12 రాష్ట్రాల్లోని 133 బొగ్గు గనులను కేంద్రం ఈసారి వేలంపాటలో వేలానికి పెట్టింది. వీటిలో నాలుగు బొగ్గు గనులు తెలంగాణలో ఉన్నాయి.)

జ: ఆరోసారి


* 2032 సంవత్సరంలో జరగనున్న ఒలింపిక్స్‌కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? (2024 ఒలింపిక్స్‌ను పారిస్‌లో, 2028 ఒలింపిక్స్‌ను లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహించనున్నారు)

జ: బ్రిస్బేన్‌, ఆస్ట్రేలియా


* కర్బన ఉద్గారాలను ఏ సంవత్సరం నాటికి సున్నా శాతానికి చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది? 

జ: 2070


* జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ఎప్పుడు   నిర్వహిస్తారు?

జ: డిసెంబరు 14 నుంచి 20 వరకుTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని