కరెంట్‌ అఫైర్స్‌

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 ఏడాదికి గానూ ‘స్వచ్ఛ్‌ సుజల శక్తి సమ్మాన్‌’ పురస్కారంతో ఎవరిని సత్కరించింది? (వీరు తమ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను తీర్చడానికి విశేష కృషి చేశారు

Published : 22 Mar 2023 03:05 IST

మాదిరి ప్రశ్నలు

* కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 ఏడాదికి గానూ ‘స్వచ్ఛ్‌ సుజల శక్తి సమ్మాన్‌’ పురస్కారంతో ఎవరిని సత్కరించింది? (వీరు తమ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను తీర్చడానికి విశేష కృషి చేశారు.)
జ: గంగా రాజ్‌పుత్‌ (మధ్యప్రదేశ్‌), గాయత్రీదేవి (రాజస్థాన్‌), శారదాదేవి (ఉత్తర్‌ప్రదేశ్‌), అనితా చౌదరి (మధ్యప్రదేశ్‌), కె.ఆశా (తమిళనాడు)


*  ఇటీవల వార్తల్లోకి వచ్చిన నీతిగినీ పూర్తి రూపం ఏమిటి? (1989లో పారిస్‌లో జరిగిన జీ-7 సదస్సులో నీతిగినీను ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం పారిస్‌లో ఉంది. సభ్య దేశాల సంఖ్య 39. భారత్‌ 2010లో ఈ సంస్థ సభ్యత్వం పొందింది. ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారం అందకుండా ఈ సంస్థ చూస్తుంది. ఉత్తర కొరియా, ఇరాన్‌, మయన్మార్‌లను ఈ సంస్థ తాజాగా బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది.)
జ: ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌


* ఏడో IWIS(ఇండియా వాటర్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌)ను ఎక్కడ నిర్వహించారు? (‘రిస్టోరేషన్‌ అండ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ స్మాల్‌ రివర్స్‌ ఇన్‌ ఎ లార్జ్‌ బేసిన్‌’ అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహించారు.)    

జ: న్యూదిల్లీ


* ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 2023 ఫిబ్రవరిలో ఏ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు? (బిశ్వభూషణ్‌ హరిచందన్‌ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ (రిటైర్డ్‌) ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు.)
జ: ఛత్తీస్‌గఢ్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని