JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. భారీగా పెరిగిన కటాఫ్‌ మార్కులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతూ వచ్చిన కటాఫ్‌ మార్కులు ఈసారి భారీగా పెరిగాయి. 2021లో 360 మార్కులకు 63, 2022లో 360కి 55 మార్కులే ఉండగా ఈసారి 86కు చేరాయి. 2021, 22 సంవత్సరాల్లో కరోనా ప్రభావంతో విద్యార్థులు తగినంత ప్రతిభ చూపలేకపోయారని నిపుణులు చెబుతున్నారు.

Updated : 19 Jun 2023 07:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతూ వచ్చిన కటాఫ్‌ మార్కులు ఈసారి భారీగా పెరిగాయి. 2021లో 360 మార్కులకు 63, 2022లో 360కి 55 మార్కులే ఉండగా ఈసారి 86కు చేరాయి. 2021, 22 సంవత్సరాల్లో కరోనా ప్రభావంతో విద్యార్థులు తగినంత ప్రతిభ చూపలేకపోయారని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పరీక్ష కఠినంగా ఉందని భావించినా.. అందుకు భిన్నంగా మార్కులు వచ్చాయి. ‘విద్యార్థులు బాగా సన్నద్ధమవుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి పోటీపడిన వారి సంఖ్య భారీగా పెరిగింది. అడ్వాన్స్‌డ్‌లో కూడా నెగ్గగలమన్న ధీమా విద్యార్థుల్లో పెరిగింది. ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఆత్మవిశ్వాసంతో పోటీపడ్డారు. దానికితోడు భౌతికశాస్త్రంలో ఈసారి 6 మార్కులు కలిపారు’ అని శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్‌ ఎం.ఉమాశంకర్‌ చెప్పారు.

ఈ ఏడాది కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు

జనరల్‌- 86, ఓబీసీ- 77, ఈడబ్ల్యూఎస్‌- 77, ఎస్సీ- 43, ఎస్టీ- 43



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని