కరెంట్‌ అఫైర్స్‌

‘నిలవు కుడిచ సింహగల్‌’ (వెన్నెల గ్రోలిన సింహాలు) పేరిట ఇటీవల మలయాళంలో ఆత్మకథను రాసిన ప్రముఖుడెవరు? (అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఈయన ఈ అత్యున్నత పదవికి  ఎదిగిన తీరును, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఈ పుస్తకంలో హృద్యంగా వివరించారు.

Updated : 25 Nov 2023 05:26 IST
మాదిరి ప్రశ్నలు
‘నిలవు కుడిచ సింహగల్‌’ (వెన్నెల గ్రోలిన సింహాలు) పేరిట ఇటీవల మలయాళంలో ఆత్మకథను రాసిన ప్రముఖుడెవరు? (అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఈయన ఈ అత్యున్నత పదవికి  ఎదిగిన తీరును, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఈ పుస్తకంలో హృద్యంగా వివరించారు.)
జ: ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌

భారత్‌ ఏ సంవత్సరం నాటికి జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక తాజాగా పేర్కొంది? (అప్పటికి భారత్‌ స్థూల దేశీయోత్పత్తి 7.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని సంస్థ అంచనా వేసింది. 2024, మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో భారత్‌ ఎకానమీ వృద్ధి సాధిస్తుందని ఎస్‌ అండ్‌ పీ అంచనా వేసింది.)

జ: 2030


అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రాకెట్ల డిజైన్‌, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం కొత్త కేంద్రం ‘మ్యాక్స్‌ క్యూ’ను ఏ నగరంలో ప్రారంభించింది? (కేంద్ర శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ ఈ కేంద్రాన్ని  ప్రారంభించారు.)

జ: హైదరాబాద్‌


అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? (స్పీకర్‌ పదవి నుంచి మెక్‌ కార్తీ తప్పుకోవడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. లూసియానా నుంచి చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నూతన స్పీకర్‌కు విపక్ష రిపబ్లికన్లు అంతా మద్దతు పలకడంతో మొదటి బ్యాలెట్‌ పోరులోనే ఈయన స్పీకర్‌గా విజయం సాధించారు.)

జ: మైక్‌ జాన్సన్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని