అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే రేడియో!

భారతదేశంలో విపత్తు నిర్వహణ కోసం నిర్దిష్టమైన, వ్యవస్థాగత నిర్మాణం బ్రిటిష్‌ పరిపాలనా కాలంలోనే మొదలైంది. 1937లో బిహార్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో సంభవించిన భూకంపాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 04 Dec 2023 06:51 IST

విపత్తు నిర్వహణ

భారతదేశంలో విపత్తు నిర్వహణ కోసం నిర్దిష్టమైన, వ్యవస్థాగత నిర్మాణం బ్రిటిష్‌ పరిపాలనా కాలంలోనే మొదలైంది. 1937లో బిహార్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో సంభవించిన భూకంపాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం భారతదేశ విపత్తు నిర్వహణ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు విపత్తులు సంభవించిన తర్వాత పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు విపత్తుల ముందస్తు నివారణ, నియంత్రణ కోసం చొరవ చూపే విధానాలు, సంసిద్ధత కార్యక్రమాలు అమలవుతున్నాయి. నేటి విపత్తు నిర్వహణ వ్యవస్థాగత నిర్మాణం, యంత్రాంగం, ఇందుకోసం చేసిన చట్టాల గురించి అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.  పలు విపత్తులను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖలు, శిక్షణ ఇచ్చే సంస్థలు, ఆ శిక్షణలో ఉండే ప్రాథమికాంశాలు, విపత్కర పరిస్థితుల్లో అవలంబించే ప్రత్యామ్నాయ మార్గాలపై తగిన అవగాహన కలిగి ఉండాలి. 

విపత్తు నిర్వహణ - వ్యవస్థాగత ఏర్పాట్లు - ఉపశమన వ్యూహాలు

1. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) ఎవరి ఆధ్వర్యంలో కొనసాగుతోంది?

1) వ్యవసాయ మంత్రిత్వశాఖ  

2) హోంమంత్రిత్వ శాఖ

3) రక్షణ మంత్రిత్వశాఖ 4) ప్రధానమంత్రి

2. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 లోని ఏ సెక్షన్‌ ప్రకారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను (NDRR) ఏర్పాటు చేశారు?

1) 41     2) 42    3) 43     4) 44

3. 14వ ఆర్థిక సంఘం ప్రకారం విపత్తు నిర్వహణకు చేపట్టే ఉపశమన చర్యల కోసం అందించే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి?

1) 75:25  2) 80:20  3) 90:10  4) 50:50

4. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు?

1) ప్రధానమంత్రి  

2) విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు

3) హోంమంత్రి  

4) కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి

5. దుర్భిక్షం లేదా కరవు నిర్వహణ ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది?

1) శాస్త్రసాంకేతిక       2) రక్షణ    

3) హోం         4) వ్యవసాయ

6. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం (NDMA)ఎప్పుడు చేశారు?

1) 2005, మే 25   2) 2005, జులై 25  

3) 2005, జూన్‌ 25   4) 2005, మే 20

7. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 2007, జనవరి 12   2) 2007, డిసెంబరు 25

3) 2006, మార్చి 13    4) 2007, ఫిబ్రవరి 23

8. విపత్తు సమయాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కమ్యూనికేషన్‌ సాధనం?

1) అమెచ్యూర్‌ రేడియో   2) ట్రాన్సిస్టర్‌  
3) టెలివిజన్‌   4) పైవేవీకావు
9. హోంగార్డు వ్యవస్థ లేని రాష్ట్రం?
1) మహారాష్ట్ర  2) కర్ణాటక  3) కేరళ  4) ఒడిశా

10. జాతీయ పౌర రక్షణ కళాశాలను దేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) ఢిల్లీ 2) కోల్‌కతా 3) నాగ్‌పుర్‌  4) జబల్‌పుర్‌

11. కిందివాటిలో విపత్తు సంభవించేందుకు ముందు తీసుకునే చర్యలు ఏవి?

1) నివారణ   2) సంసిద్ధత  
3) ఉపశమనం   4) పైవన్నీ

12. విపత్తు సంభవించాక తీసుకునే చర్యలు ఏవి?

1) పునరావాసం   2) పునర్నిర్మాణం  
3) ఉపశమనం   4) పైవన్నీ

13. కిందివాటిలో విపత్తు నిర్వహణపై ఏది శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది?

1) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌
2) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌
3) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
4) నేషనల్‌ పోలీస్‌ అకాడమీ

14. జాతీయ విపత్తు నిర్వహణ విధానానికి ఏ సంవత్సరంలో మంత్రివర్గం అనుమతిచ్చింది?

1) 2009  2) 2008  3) 2007  4) 2010

15. పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలో అంతర్భాగాలు?

1) ప్రమాదం గుర్తింపు, అంచనా
2) అధ్యాపకులను, పాఠశాల యాజమాన్యాన్ని చైతన్యం చేయడం
3) పటాలను తయారుచేయడం       4) పైవన్నీ

16. కోస్టల్‌ వల్నరబిలిటీ ఇండెక్స్‌ (C.V,I)హైదరాబాద్‌లో విడుదల చేసినవారు ఎవరు?

1) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ
2) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ
3) భారత వాతావరణ శాఖ
4) జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం

17. విపత్తు నిర్వహణ బృందంలో ఉండాల్సినవి?

1) అన్వేషణ, రక్షణ బృందం      
2) ప్రథమ చికిత్స బృందం
3) అవగాహన పెంపుదల బృందం   4) పైవన్నీ

18. విపత్తు నిర్వహణ చట్టం కింద ఏర్పడిన  యంత్రాంగాలు?

1) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ
2) రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ
3) జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ    4) పైవన్నీ

19. దేశంలో విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయం చేసే కేంద్ర మంత్రిత్వశాఖ?

1) గ్రామీణాభివృద్ధి శాఖ     2) రక్షణ శాఖ
3) దేశీయ వ్యవహారాల శాఖ   4) ప్రసారాల శాఖ

20. ఏ అఖిల భారత సర్వీసు సభ్యుల ప్రాథమిక శిక్షణలో విపత్తు నిర్వహణను ఒక భాగంగా చేర్చారు?

1) ఐ.ఎ.ఎస్‌.   2) ఐ.పి.ఎస్‌.  
3) ఐ.ఎఫ్‌.ఎస్‌.   4) పైవన్నీ

21. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వివార్షిక పత్రిక పేరు?

1) డిజాస్టర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌  
2) డిజాస్టర్‌ ఇండియా
3) డిజాస్టర్‌ మిటిగేషన్‌   4) ఇండియన్‌ డిజాస్టర్‌

22. కిందివాటిలో విపత్తు సంసిద్ధత, స్పందన కార్యక్రమాలతో సంబంధం ఉన్నవి?

1) భారత వాతావరణ శాఖ  
2) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
3) కేంద్ర జల కమిషన్‌      4) పైవన్నీ

23. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో ‘డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం’ను ప్రారంభించింది?

1) ఒడిశా   2) తమిళనాడు  
3) గుజరాత్‌   4) కేరళ
24. ‘అమెచ్యూర్‌ రేడియో’కి మరొక పేరు?
1) సునామీ రేడియో   2) విపత్తు రేడియో  
3) పాకెట్‌ రేడియో   4) హామ్‌ రేడియో

25. ఏ విద్యాబోధనలో ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, విపత్తు నిర్వహణపై కార్యక్రమాలు నిర్వహించింది?

1) ఇంజినీరింగ్‌       2) మేనేజ్‌మెంట్‌
3) ఆర్కిటెక్చర్‌       4) కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌

26. అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు కిందివాటిలో దేనిని ఐక్యరాజ్యసమితి జవాబుదారీ చేసింది?

1) ఐక్యరాజ్యసమితి ఆఫీస్‌ ఫర్‌ కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యుమానిటేరియన్‌ ఎఫైర్స్‌
2) యునెస్కో
3) ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం
4) ఐక్యరాజ్య సమితి ఆఫీస్‌ ఆఫ్‌ మిటిగేషన్‌ ఆఫ్‌ డిజాస్టర్స్‌

27. విపత్తు నిర్వహణ సిబ్బంది దేనిలో శిక్షణ పొంది ఉండాలి?

1) ప్రాథమిక చికిత్సలో      2) పరిశుభ్రతలో
3) భయాందోళనపై సలహా ఇవ్వడంలో  
4) పైవన్నీ

28. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 2005, డిసెంబరు 25  
2) 2005, డిసెంబరు 24
3) 2005, డిసెంబరు 23  
4) 2005, డిసెంబరు 20

29. దుర్భిక్షం మినహాయించి ఇతర సహజ విపత్తుల నిర్వహణ ఏ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉంటుంది?

1) వ్యవసాయ మంత్రిత్వశాఖ  
2) రక్షణ మంత్రిత్వ శాఖ
3) ప్రధానమంత్రి   4) హోంమంత్రిత్వ శాఖ

30. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు పనిచేయని సందర్భాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కమ్యూనికేషన్‌ సాధనం?

1) హామ్‌ లేదా అమెచ్యూర్‌ రేడియో  2) గ్రామ్‌ఫోన్‌  
3) టెలివిజన్‌          4) పైవన్నీ
31. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

జాతీయ విపత్తు నిర్వహణ  ప్రధాన కార్యాలయం
      సంస్థ
1) భారత వాతావరణ       న్యూఢిల్లీ
   శాఖ(IMA)
2) డిజాస్టర్‌ మిటిగేషన్‌       అహ్మదాబాద్‌
   ఇన్‌స్టిట్యూట్‌ (DMI)
3) సెంటర్‌ ఫర్‌ డిజాస్టర్‌       పుణె
   మేనేజ్‌మెంట్‌ (CDM)      
4) సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌   కాట్‌మాండు
   సెంటర్‌ (SDMC)

32. సార్క్‌ దూర విపత్తు నిర్వహణ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది?

1) కొలంబో         2) కాట్‌మాండు
3) ఢాకా           4) న్యూఢిల్లీ  

33. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది?

1) టోక్యో (జపాన్‌)     2) జకార్తా (ఇండొనేసియా)
3) మాలె (మాల్దీవులు)  4) హొనొలులు (అమెరికా)

34. విపత్తు నిర్వహణ భాషలో DRBAC అంటే?

1) డేంజర్‌, రెస్పాన్స్‌, ఎయిర్‌వే, బ్రీతింగ్‌, సర్క్యులేషన్‌
2) డేంజర్‌, రిఫ్లెక్షన్‌, ఎయిర్‌వే, బెడ్‌, కోల్డ్‌
3) డేంజర్‌, రిఫరెన్స్‌, ఎయిర్‌వే, బ్రేక్‌, కోల్డ్‌
4) డేంజర్‌, రెస్పాన్స్‌, ఎయిర్‌, బ్లడ్‌

35. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

అంతర్జాతీయ విపత్తు  నిర్వహణ సంస్థ           ప్రధాన కార్యాలయం  
1) పసిఫిక్‌ సునామీ       హవాయి (అమెరికా)
   వార్నింగ్‌ సెంటర్‌                  
2) సౌత్‌ ఏసియన్‌ డిజాస్టర్‌      మనీలా (ఫిలిప్పీన్స్‌)
   నాలెడ్జ్‌ వర్క్‌              
3) ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ      జెనీవా (స్విట్జర్లాండ్‌)
   ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌          
4) ఆసియన్‌ డిజాస్టర్‌     కోబ్‌ (జపాన్‌)
   రిడక్షన్‌ సెంటర్‌

36. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థలో సభ్యుల సంఖ్య ఎంత?

1) 6     2) 9    3) 10     4) 12

37. జాతీయ విపత్తు నిర్వహణ విధానానికి మంత్రివర్గం ఎప్పుడు ఆమోదం తెలిపింది?

1) 2007  2) 2008  3) 2009  4) 2010

38. 15వ ఆర్థిక సంఘం ప్రకారం స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ 2021-2025 కాలానికి ఎంత మొత్తం నిధులు కేటాయించారు?

1) రూ.1,28,122 కోట్లు  2) రూ.61,220 కోట్లు
3) రూ.1,15,330 కోట్లు  4) రూ.92,422 కోట్లు

39. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాల కింద [విదీళినీ] ఎన్ని బెటాలియన్లు ప్రస్తుతం దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి?

1) 10    2) 12     3) 14    4) 16

40. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
విపత్తు రకం       నిర్వహణ చేపట్టే మంత్రిత్వశాఖ
1) భూకంపాలు      హోం మంత్రిత్వశాఖ
2) పారిశ్రామిక, పర్యావరణం, అటవీ   రసాయన విపత్తులు మంత్రిత్వశాఖ
3) బయోలాజికల్‌ ఆరోగ్య, కుటుంబ విపత్తులు          సంక్షేమ మంత్రిత్వశాఖ
4) తుపాన్లు/ టోర్నడోలు         జల మంత్రిత్వ శాఖ


సమాధానాలు

1-3; 2-4; 3-3; 4-4; 5-4; 6-4; 7-4; 8-1; 9-3; 10-3; 11-4; 12-4; 13-4; 14-1; 15-4; 16-4; 17-4; 18-1; 19-4; 20-3; 21-1; 22-4; 23-4; 24-4; 25-1; 26-4; 27-4; 28-3; 29-4; 30-1; 31-4; 32-4; 33-4; 34-1; 35-2; 36-2; 37-3; 38-1; 39-2; 40-4.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని